మలేషియాలో అక్రమంగా ఉన్న తెలుగు కార్మికులకు కీలక హెచ్చరిక..
- April 15, 2026
కౌలాలంపూర్: మలేషియాలో ఏజెంట్ల మోసాలకు గురై డాక్యుమెంట్లు లేకుండా లేదా ఓవర్‌స్టే కారణంగా అక్రమంగా నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన తెలుగు కార్మికులకు ఫెడరేషన్ ఆఫ్ NRI కల్చరల్ అసోసియేషన్స్ మలేషియా (FNCA-మలేషియా) అత్యవసర విజ్ఞప్తి చేసింది.
మలేషియా ప్రభుత్వం ప్రవేశపెట్టిన PRM 2.0 (Program Repatriasi Migran 2.0) అమ్నెస్టీ కార్యక్రమం ముగియడానికి ఇక మరో 15 రోజులు మాత్రమే మిగిలి ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ కార్యక్రమం ఏప్రిల్ 30తో ముగియనుంది.
FNCA-మలేషియా ప్రకారం, ఈ PRM 2.0 పథకం డాక్యుమెంట్లు లేని, వీసా గడువు ముగిసి ఓవర్‌స్టే అయిన విదేశీ కార్మికులకు చివరి కీలక అవకాశం. దీని ద్వారా వారు తమ నివాసాన్ని చట్టబద్ధం చేసుకోవచ్చు లేదా ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు లేకుండా సురక్షితంగా స్వదేశానికి తిరిగి వెళ్లవచ్చు.
ఈ సందర్భంగా FNCA-మలేషియా అధ్యక్షుడు బూరెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ,
“చాలా కాలంగా ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న తెలుగు కార్మికులు భయం లేకుండా, గౌరవంగా స్వదేశం చేరేందుకు ఇది సువర్ణ అవకాశం. అయితే గడువు ముగిసేలోపు ఈ అవకాశాన్ని వినియోగించుకోకపోతే నిర్బంధం, భారీ జరిమానాలు, జైలు శిక్ష వంటి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది” అని హెచ్చరించారు.
ఈ అమ్నెస్టీ పథకం ద్వారా స్వదేశానికి వెళ్లదలచిన కార్మికులు 500 మలేషియా రింగ్గిట్ (సుమారు రూ.10,000) చెల్లించాల్సి ఉంటుంది.
- పాస్‌పోర్టు ఉన్నవారు తమ పాస్‌పోర్టును సమర్పించాలి
- పాస్‌పోర్టు లేనివారు ఎమర్జెన్సీ ట్రావెల్ సర్టిఫికెట్ పొందాలి
- అదనంగా, వారంరోజుల్లోగా స్వదేశానికి వెళ్లేందుకు విమాన టికెట్‌ను స్వయంగా కొనుగోలు చేయాలి
FNCA-మలేషియా తో పాటు ఇతర తెలుగు NRI సంఘాలు కూడా ప్రభావిత కార్మికులకు అప్లికేషన్ ప్రక్రియ, డాక్యుమెంటేషన్ మరియు మార్గదర్శకత్వంలో పూర్తి సహాయం అందిస్తున్నట్లు తెలిపాయి. ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సంస్థలు సూచిస్తున్నాయి.
అమ్నెస్టీ పథకం గురించి సందేహాలు ఉన్నవారు లేదా సహాయం అవసరమైన వారు
FNCA-మలేషియా లేదా సమీపంలోని స్థానిక తెలుగు NRI సంఘాలను తక్షణం సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం
- చిన్ననాటి స్నేహితుడి కోసం సచిన్.. వినోద్ కాంబ్లీకి అండగా మాజీ క్రికెటర్లు
- కొత్త రాయబారుల క్రెడెన్షియల్స్ స్వీకరించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- ట్రాన్స్మిషన్ లోపం..18,708 Toyota-Lexus వాహనాలు రీకాల్..!!
- నిషేధిత రంగాలకు కార్మికుల బదిలీ..కువైట్ అనుమతి..!!
- యూఏఈ లేబర్ మార్కెట్ స్టెబుల్..సకాలంలో సాలరీలు క్రిడెట్..!!
- నకిలీ హజ్ సేవల ప్రచారం..ఈజిప్షియన్ అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాల పై కింగ్ సుల్తాన్, ఖతార్ ఎమిర్ చర్చలు..!!
- గడువు ముగిసిన ఫైనాన్స్ సర్టిఫికేట్లు..మరో 3 నెలల పాటు పొడిగింపు..!!
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం









