యూఏఈ వ్యాప్తంగా స్కూల్ బస్సుల నిర్వహణ తాత్కాలిక వాయిదా!

- April 16, 2026 , by Maagulf
యూఏఈ వ్యాప్తంగా స్కూల్ బస్సుల నిర్వహణ తాత్కాలిక వాయిదా!

యూఏఈ: యూఏఈలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు, నర్సరీలు మరియు కిండర్ గార్టెన్‌లలో స్కూల్ బస్సు సర్వీసులను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పాఠశాలల్లో నేరుగా తరగతులు (In-person learning) ప్రారంభించడానికి జరుగుతున్న ఏర్పాట్లలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

 రవాణా సంస్థలు మరియు మున్సిపాలిటీలతో సమన్వయం చేసుకుంటూ, అత్యున్నత భద్రతా ప్రమాణాలను (Safety Standards) నిర్ధారించిన తర్వాతే బస్సులను రోడ్డెక్కించాలని అధికారులు నిర్ణయించారు.

ఈ నిర్ణయాన్ని ప్రతి వారం సమీక్షిస్తారు. పరిస్థితులు అనుకూలించినప్పుడు, రవాణా సేవలను తిరిగి ప్రారంభించే తేదీని అధికారిక ఛానెళ్ల ద్వారా వెల్లడిస్తారు.

 విద్యార్థుల ప్రయాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా, పూర్తి సురక్షితంగా ఉండేలా చూడటమే ఈ వాయిదా వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.

ప్రస్తుతానికి బస్సు సౌకర్యం లేనందున, పాఠశాలలకు వెళ్లాల్సిన విద్యార్థుల తల్లిదండ్రులు సొంత వాహనాల్లో లేదా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపాల్సి ఉంటుంది. లేదా ఆయా పాఠశాలలు ఇచ్చే తదుపరి సూచనల వరకు వేచి చూడాలి.

--బాజీ షేక్(యూఏఈ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com