ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!
- April 16, 2026
న్యూ ఢిల్లీ: ఢిల్లీ విమానాశ్రయంలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. రన్‌వేపై ఉన్న ఆకాశ ఎయిర్‌లైన్స్, స్పైస్‌జెట్ విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు విమానాలకు స్వల్పంగా నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగిన తీరు పై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. విమానాశ్రయ కార్యకలాపాలకు దీనివల్ల అంతరాయం కలిగిందా? విమానాల్లో ప్రయాణికుల పరిస్థితి ఏంటి? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. అధికారులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఔద్ మైథా రోడ్–అల్ అసాయెల్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..







