ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- April 16, 2026
న్యూజిలాండ్: ఎయిర్ ప్రయాణంలో కొత్త అనుభవం అందించేందుకు ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం తీసుకుంది. బస్సులు, రైళ్లలో కనిపించే స్లీపర్ సదుపాయాన్ని ఇప్పుడు విమానాల్లో కూడా అందుబాటులోకి తీసుకురానుంది.
దీర్ఘకాలిక విమాన ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా మార్చే లక్ష్యంతో ‘స్కైనెస్ట్ పాడ్స్’ పేరుతో ప్రత్యేక స్లీపర్ బెడ్‌లను ప్రవేశపెడుతోంది. ముఖ్యంగా 17 గంటల పాటు సాగే లాంగ్-హాల్ ఫ్లైట్లలో ఈ సదుపాయం ప్రయాణికులకు ఉపయోగపడనుంది.
వచ్చే నవంబర్ నుంచి న్యూయార్క్–ఆక్లాండ్ మార్గంలో నడిచే విమానాల్లో ఈ స్కైనెస్ట్ పాడ్స్ అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రత్యేక విభాగంలో ఒకేసారి ఆరుగురు ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేలా ఏర్పాట్లు చేశారు.
ప్రతి ప్రయాణికుడు సుమారు 4 గంటల పాటు ఈ స్లీపర్ సదుపాయాన్ని వినియోగించుకోగలరు. ఆ తర్వాత ఇతర ప్రయాణికులకు అవకాశం ఇవ్వబడుతుంది. ఈ సేవను ఉపయోగించుకోవాలనుకునే వారు ముందుగానే బుకింగ్ సమయంలో ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
దీంతో విమాన ప్రయాణంలో నిద్ర, విశ్రాంతి వంటి అంశాలు మరింత సౌకర్యవంతంగా మారనున్నాయని విమానయాన రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్!
- మక్కాలో ఐదుగురు పాకిస్థానీలు అరెస్ట్..!!
- బర్కా, యాంకుల్కు WHO ‘హెల్తీ సిటీ’ గుర్తింపు..!!
- 2030 విజన్ కోసం ఖతార్ కీలక అడుగు..!!
- మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదాలు–15 మంది మృతి!
- పాస్‌పోర్ట్ అవసరం లేదు.. లగేజ్ ట్యాగ్ కూడా ఉండదు..!!
- షార్జా ఎక్స్పో సెంటర్లో మమ్ముట్టి ‘రాజకీయమ్’ షో..
- జగదీశ్వరరెడ్డిని సైనైడ్‌తో కడతేర్చిన సాధిక్‌ఖాన్
- BRICS శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే అతిథుల పూర్తి జాబితా
- UAEలో 2027లో పబ్లిక్ హాలిడేలలో భారీ మార్పు.. 2026తో పోలిస్తే తగ్గనున్న సెలవులు







