యూఏఈలో స్కూల్ బస్సు సర్వీసులు వాయిదా..!!
- April 16, 2026
యూఏఈ: మిడిలీస్టులో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల కారణంగా.. యూఏఈలోని ప్రైవేట్ స్కూళ్లతోపాటు నర్సరీలు, కిండర్ గార్డెన్ల బస్సు సర్వీసులను వాయిదా వేస్తున్నట్లు యూఏఈ విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
అయితే, తదుపరి నిర్ణయం వీక్లీ సమీక్ష సందర్భంగా తీసుకుంటామని, సంబంధిత అధికారులతో చర్చించాక తుది నిర్ణయం ప్రకటిస్తామని పేర్కొంది. పాఠశాల బస్సు సర్వీసుల పునఃప్రారంభానికి సంబంధించిన ఏదైనా సమాచారాన్ని అధికారిక, ఆమోదిత ఛానెళ్ల ద్వారా ప్రకటించబదుతుందని తెలిపింది.
ఒక నెల కంటే ఎక్కువ రోజులపాటు రిమోట్ లెర్నింగ్ క్లాసుల తర్వాత, యూఏఈ వ్యాప్తంగా విద్యార్థులు ఏప్రిల్ 20 నుండి ప్రత్యక్ష తరగతులకు హాజరు కావడం ప్రారంభిస్తారు.
అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భద్రతాపరమైన ఆందోళనల కారణంగా ముందుజాగ్రత్త చర్యగా పాఠశాలలు రిమోట్ లెర్నింగ్ కు మారిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఔద్ మైథా రోడ్–అల్ అసాయెల్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..







