బహ్రెయిన్ లో 473,323మంది ప్రవాసులకు బీమా కవరేజీ..!!

- April 16, 2026 , by Maagulf
బహ్రెయిన్ లో 473,323మంది ప్రవాసులకు బీమా కవరేజీ..!!

మనామా: బహ్రెయిన్ ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ప్రవాసుల బీమా కవరేజీ 2025 మూడవ త్రైమాసికం చివరి నాటికి 473,323కి చేరుకుంది. ఈ మేరకు సామాజిక బీమా సంస్థ (Social Insurance Organisation) MP జలాల్ కాధేమ్‌కు గణంకాలను సమర్పించింది.

ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో బీమా పరిధిలో ఉన్న బహ్రెయిన్ పౌరుల సంఖ్య కూడా ఇదే కాలంలో క్రమంగా పెరిగిందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.  2023లో 151,659 నుండి 2024లో 154,894కి పెరిగి, 2025 మూడవ త్రైమాసికం నాటికి 157,213కి చేరుకుంది.

ఇదే సమయంలో ప్రైవేట్ రంగంలో బీమా పరిధిలో ఉన్న బహ్రెయిన్ యేతర పౌరుల సంఖ్య 2023లో 458,768 నుండి 2024లో 467,267కి పెరిగి, 2025లో 473,323కి చేరుకుంది.

ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ప్రవాసులకు కేవలం 'వర్క్ సంబంధిత గాయాల బీమా' (work injury insurance) మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది. మొత్తం బీమా విరాళాలు 2023లో BD418.657 మిలియన్లుగా ఉండగా, 2024లో అవి BD437.448 మిలియన్లకు పెరిగాయి.

పెన్షన్లు పొందుతున్న పదవీ విరమణ చేసిన వారి సంఖ్య కూడా పెరిగింది.  ఇది 2023లో 84,612 నుండి 2024లో 85,607కి, అలాగే 2025 మూడవ త్రైమాసికం చివరి నాటికి 86,003కి చేరుకుందని నివేదికలో వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com