#SVC63 మూవీ హై-ఆక్టేన్ మొదటి షెడ్యూల్ ఈ రోజు ముంబైలో ప్రారంభం

- April 18, 2026 , by Maagulf
#SVC63 మూవీ హై-ఆక్టేన్ మొదటి షెడ్యూల్ ఈ రోజు ముంబైలో ప్రారంభం

సల్మాన్ ఖాన్–వంశీ పైడిపల్లి–దిల్ రాజు కాంబినేషన్ లో మోస్ట్ ఎవైటెడ్  ప్రాజెక్ట్ షూటింగ్ దశలోకి అడుగుపెట్టింది. ముంబైలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమవగా, కథానాయికగా నయనతార అధికారికంగా సెట్స్‌లో చేరారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు వంశీ పైడిపల్లి ఫస్ట్ కొలాబరేషన్  కావడం విశేషం. ఈ కాంబినేషన్ ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించగా, షూటింగ్ ప్రారంభంతో ఆ ఆసక్తి మరింత పెరిగింది.
 
#SVC63 ప్రాజెక్టు  ఈరోజు సంప్రదాయ ముహూర్తం కార్యక్రమంతో ప్రారంభమై, నెల రోజులపాటు సాగనున్న భారీ షెడ్యూల్ మొదలైంది. ముంబైలో ప్రత్యేకంగా నిర్మించిన హ్యూజ్ సెట్లో హై-ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలు, కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ కీలక షెడ్యూల్‌లో నయనతార కూడా ప్రధాన తారాగణంలో చేరారు. ప్రతి పాత్రని బలంగా తీర్చిదిద్దే వంశీ పైడిపల్లి, ఈ చిత్రంలో ప్రధాన పాత్రలని అద్భుతంగా రూపొందించారు. సల్మాన్ ఖాన్–నయనతార జోడీ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

దర్శకుడు వంశీ పైడిపల్లి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ “#సల్మాన్ ఖాన్ వంశీ పైడిపల్లి ఫిల్మ్… ఈరోజు మొదలైంది..” అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

త్వరలోనే పూర్తి తారాగణం, సాంకేతిక బృందం వివరాలను వెల్లడించనున్నారు.

బలమైన భావోద్వేగాలతో కూడిన హై ఎనర్జీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం 2027లో గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తారాగణం: సల్మాన్ ఖాన్, నయనతార

సాంకేతిక నిపుణులు:
రచన, దర్శకత్వం: వంశీ పైడిపల్లి
నిర్మాత: దిల్ రాజు
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
PRO: వంశీ-శేఖర్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com