ఏపీ ప్రత్యేక హోదాపై పార్లమెంటు సమావేశాల తర్వాత నిర్ణయం

- August 05, 2016 , by Maagulf
ఏపీ ప్రత్యేక హోదాపై పార్లమెంటు సమావేశాల తర్వాత నిర్ణయం

రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం రగడ సృష్టిస్తోన్న వేళ ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు జోరుపెంచినట్టే కనిపిస్తోంది. ప్రధాని మోదీతో జరిపిన భేటీలో ఎపి ప్రత్యేక హోదా అంశంపై ఇంకా తాత్సారం చేయడం ఇరుపార్టీలకు మంచిది కాదని తేల్చి చెప్పినట్టు సమాచారం. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. పార్లమెంటు సమావేశాల తర్వాత నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎపిలో స్పెషల్ స్టేటస్ సెంటిమెంట్ బలంగా ఉందని, దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కూడా కోరారని వినికిడి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com