బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- April 20, 2026
బహ్లా: బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ను హెరిటేజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి సయ్యద్ ఇబ్రహీం బిన్ సయీద్ అల్ బుసైదీ ప్రారంభించారు. ఇవి ఒమన్ సాంస్కృతిక విశేషాలతోపాటు ఒక సమగ్ర వారసత్వ విషయాలను తెలిపే గమ్యస్థానంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ మ్యూజియంలు సందర్శకులకు మెరుగైన అనుభవాన్ని ఇస్తాయని అన్నారు.
'బైత్ అల్ హదీత్'లో ఉన్న పురావస్తు సేకరణల మ్యూజియం.. బహ్లా కోట మరియు బహ్లా ఒయాసిస్‌లో పునరుద్ధరణ పనుల సమయంలో కనుగొనబడిన కళాఖండాలను ప్రదర్శనకు పెట్టారు. వీటిలోని చాలా వస్తువులు క్రీస్తుపూర్వం మూడవ సహస్రాబ్ది నాటివి. వారసత్వ మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ అందించిన పురావస్తు సేకరణలతో ఈ మ్యూజియం ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో అభివృద్ధి చేశారు.
'బైత్ అల్ జబల్'లో ఉన్న ఉల్కల మ్యూజియం ఒమన్‌లో కనుగొనబడిన మూడు రకాల ఉల్కలను ప్రదర్శిస్తుంది. వాటి మూలం, కూర్పును తెలియజేసే శాస్త్రీయ వివరణలు కూడా ఇక్కడ చూడవచ్చు.
'బుర్జ్ అల్ జిహాద్రి'లో ఉన్న ఒమానీ తేనె మ్యూజియం సాంప్రదాయ తేనెటీగల పెంపకం పద్ధతులు మరియు తేనె ఉత్పత్తి విధానాలను తెలియజేస్తుంది. కోట నిర్వహణ సంస్థ సహకారంతో బహ్లాకు చెందిన ఒక స్థానిక పెట్టుబడిదారుడు దీనిని నిర్వహిస్తున్నారు.
'అల్ ఖసాబా'లోని డోర్స్ మ్యూజియంలో ఒమన్‌లోని ఎనిమిది పురాతన చెక్క తలుపులు ఉన్నాయి. వాటిలో ఒకటి 750 సంవత్సరాల కంటే పాతదని అంచనా. కొన్ని తలుపులపై అసలైన చేతివృత్తుల వారి పనితీరుతోపాటు ఇస్లాం పూర్వ నాగరికతలకు సంబంధించిన చెక్కడాలు మరియు నబహినా కాలం నాటి ఒక ఇస్లామిక్ శాసనం దాని అసలు రూపంలో భద్రపరచారు.
వీటితోపాటు సాంప్రదాయ ఆయుధాలు మరియు తాళపత్ర గ్రంథాలు సహా అదనపు మ్యూజియంలు, ప్రదర్శనలు, వర్క్‌షాప్‌లు మరియు ఇంటరాక్టివ్ సాంస్కృతిక ప్రదేశాల వంటి సహాయక సౌకర్యాలతో కూడినవి ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నాయని అల్ మరాసిమ్ టూరిజం అండ్ ఇన్వెస్ట్మెంట్ డైరెక్టర్-జనరల్ ఇంజనీర్ అలీ బిన్ అహ్మద్ అల్ షాక్సీ వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







