ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- April 20, 2026
దోహా: పర్యావరణ సుస్థిరతను పెంపొందించడానికి మరియు మున్సిపల్ సేవల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ నిరంతరాయంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా పర్యావరణ అనుకూల వాహనాలు, పరికరాలతో కూడిన ఒక ఆధునిక ఫ్లీట్ ను మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ వాహన ఫ్లీట్ ను పబ్లిక్ సర్వీస్ వ్యవహారాల సహాయ కార్యదర్శి (Assistant Undersecretary) ఇంజనీర్ అబ్దుల్లా అహ్మద్ అల్ కరానీ ప్రారంభించారు.
ఉత్తమ పర్యావరణ పద్ధతులను అవలంబించడంలో మంత్రిత్వ శాఖకు ఉన్న నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందని ఆయన వెల్లడించారు. క్షేత్రస్థాయి కార్యకలాపాల సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో మరియు వాయు నాణ్యతను పెంపొందించడంలో వీటి పాత్రను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
మెకానికల్ పరికరాల విభాగం డైరెక్టర్ షురైదా సుల్తాన్ అల్ రుమైహి మాట్లాడుతూ.. ఈ వాహన ఫ్లీట్ ను ప్రవేశపెట్టడం అనేది నిర్వహణ ప్రక్రియలకు మద్దతు ఇవ్వడంలో ఒక కీలక ముందడుగు అని పేర్కొన్నారు. ప్రపంచ సాంకేతికతలకు అనుగుణంగా భద్రత మరియు సామర్థ్య ప్రమాణాలను బలోపేతం చేస్తుందన్నారు. అత్యున్నత సాంకేతిక మరియు పర్యావరణ నిర్దేశాలకు అనుగుణంగా ఈ వాహనాలను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు.
ప్రపంచ అత్యున్నత పర్యావరణ ప్రమాణాలలో ఒకటిగా వర్గీకరించిన “యూరో 6” ఇంజన్‌లతో ఈ వాహనాలు పనిచేస్తాయని అన్నారు. ఇవి హానికరమైన ఉద్గారాలను తగ్గించడానికి, ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, శబ్ద స్థాయిలను తగ్గించడానికి.. అదే సమయంలో అధునాతన హెచ్చరిక లైట్లు రహదారి భద్రతను పెంచడానికి దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ వాహన ఫ్లీట్ లో శవపేటికలను తరలించే అంబులెన్సులు, రిఫ్రిజిరేటేడ్ వ్యాన్లు, స్ట్రీట్స్ వాషింగ్ వాహనాలు, వ్యర్థాలను సేకరించే ట్రక్కులు, కంటైనర్ క్యారియర్లు, అలాగే ఒక స్ట్రీట్ స్వీపర్, ఒక బీచ్‌ను శుభ్రపరిచే ట్రాక్టర్, ఒక వ్యర్థాల సేకరణ వాహనంతో సహా పలు రకాల ప్రత్యేకమైన ఆధునిక వాహనాలు ఉన్నాయని వివరించారు.
తాజా వార్తలు
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి







