తెలంగాణ భవన్‌లో కేసీఆర్ కీలక సమావేశం
- April 21, 2026
హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పార్టీ రజతోత్సవాల ముగింపు దశలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ భవిష్యత్ వ్యూహంపై దృష్టి సారించారు.ఈ నెల 27న హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పార్టీ ముఖ్య నేతలతో ఆయన కీలక సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ ముఖ్య నాయకులకు ఆహ్వానాలు పంపించారు. ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు మరియు ఇతర కీలక నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చ జరగనుంది.
ఈ భేటీలో పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించే అవకాశం ఉంది. సభ్యత్వ నమోదు కార్యక్రమాలు వేగవంతం చేయడం, కొత్త నాయకత్వాన్ని తీసుకురావడం, పార్టీ కేడర్‌ను చురుకుగా మార్చడం వంటి అంశాలపై కేసీఆర్ మార్గనిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







