'ఆటాడుకుందాం.. రా' ఆడియో వేడుకను నిన్న గ్రాండ్ గా ...
- August 05, 2016
కాళిదాసు, కరెంట్, అడ్డా వంటి సూపర్‌హిట్ చిత్రాల హీరో సుశాంత్ కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో జి.నాగేశ్వరరెడ్డి తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ 'ఆటాడుకుందాం.. రా'(జస్ట్ చిల్). ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో వేడుకను నిన్న గ్రాండ్ గా నిర్వహించారు. అఖిల్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అనూప్ అందించిన పాటలు శ్రోతలని అలరిస్తున్నాయి. ఈ చిత్రంకోసం నటసామ్రాట్ డా|| అక్కినేని నాగేశ్వరరావు నటించిన 'దేవదాసు' చిత్రంలోని ఎవర్‌గ్రీన్ సాంగ్ 'పల్లెకు పోదాం.. పారుని చూద్దాం ఛలో ఛలో' పాటని రీమిక్స్ చేశారు. తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా 'ఆటాడుకుందాం.. రా' చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించగా ఈ చిత్రంలో సెంటిమెంట్, ఎమోషన్‌తోపాటు అందర్నీ థ్రిల్ చేసే యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా వున్నాయట . ఇక ఈ చిత్రంలో కథానాయికగా సోనమ్ ప్రీత్ నటించింది. బ్రహ్మానందం, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్, రఘుబాబు, పృథ్వీ, ఫిరోజ్ అబ్బాసి, సుధ, ఆనంద్, రమాప్రభ, రజిత, హరీష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. తాజాగా చిత్ర థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. ఆ ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- ఎల్డీసీలకు అంతర్జాతీయ మద్దతు పెంచాలి: ఖతార్
- యూఏఈ: భారతీయ సంఘాల ప్రతినిధులతో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్ భేటీ
- మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి అర్పించిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్
- సౌదీ అరేబియా పై హౌతీల బాలిస్టిక్ క్షిపణుల దాడి యత్నం..
- పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- భారత దేశవ్యాప్తంగా రేపు కాంగ్రెస్ నిరసనలు
- యూఏఈలో ఇరాన్ ఎయిర్‌లైన్స్ విమానాలు నిలిపివేత.. తదుపరి ఆదేశాల వరకు సస్పెన్షన్
- దుబాయ్ ఫౌంటెన్ షోలు పునఃప్రారంభం.. తగ్గిన శబ్దంతో ప్రదర్శనలు
- స్థానిక ఎన్నికల పై జగన్ ఫోకస్.. అభ్యర్థుల ఎంపిక పై కీలక ఆదేశాలు
- 476 మంది స్కూల్ బస్సు డ్రైవర్లు, సూపర్వైజర్లకు దుబాయ్ పోలీసుల శిక్షణ







