దాయిద్లోని 17 నిర్మాణ సంస్థలకు జరీమానా
- August 05, 2016
దాయిద్ మునిసిపాలిటీలోని 17 నిర్మాణ సంస్థలకు జరీమానా విధించారు. నిబంధనల్ని అతిక్రమించిన కారణంగా గడచిన ఆరు నెలల్లో జరిగిన తనిఖీల అనంతరం ఈ జరీమానాల్ని విధించినట్లు అధికారులు తెలిపారు. దాయిద్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ అలి అల్ తునాజి మాట్లాడుతూ, అక్రమ నిర్మాణాలు, అనుమతి లేకుండా ఫార్మ్స్‌లో నిర్మాణాలు చేపట్టడం, భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిర్మాణాలు చేపట్టడం, తాత్కాలిక ఫెన్సింగ్ లేకుండా నిర్మాణాలు కొనసాగిస్తుండడం, అక్రమంగా కన్స్ట్రక్షన్ వేస్ట్‌ని డంప్ చేయడం, అలాగే నిర్మాణానికి సంబంధించి ఎలాంటి సైన్ బోర్డ్స్‌ని వినియోగించకపోవడం వంటి నేరాలకుగాను ఈ జరీమానాల్ని విధించినట్లు తెలిపారు. ఇంకోవైపున దాయిద్ మునిసిపాలిటీ 335 లైసెన్సులను కన్స్ట్రక్షన్ ఎస్టాబ్లిష్మెంట్స్ కోసం మంజూరు చేసిందని, 261 కన్స్ట్రక్షన్ డ్రాయింగ్స్‌ని ఆమోదించిందని, 154 ప్రాజెక్ట్ అకంప్లిష్మెంట్ సర్టిఫికెట్లను మంజూరు చేసిందని ఆయన వివరించారు. నిర్మాణ రంగానికి మునిసిపాలిటీ నుంచి పూర్తి సపోర్ట్ ఉంటుందని అయితే ఖచ్చితంగా నిర్మాణ సంస్థలు నిబందనల్ని పాటించాల్సిందేనని స్పష్టం చేశారు అలి అల్ తునాజి.
తాజా వార్తలు
- 2027లో బెస్ట్ ట్రావెల్ డెస్టినేషన్లలో ఒమన్..!!
- కువైట్‌లో ఫైర్ ఫోర్స్ కొత్త వాట్సాప్ సర్వీస్..!!
- బహ్రెయిన్‌లో డైవింగ్ సెంటర్లలో తనిఖీలు..!!
- ఎల్డీసీలకు అంతర్జాతీయ మద్దతు పెంచాలి: ఖతార్
- యూఏఈ: భారతీయ సంఘాల ప్రతినిధులతో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్ భేటీ
- మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి అర్పించిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్
- సౌదీ అరేబియా పై హౌతీల బాలిస్టిక్ క్షిపణుల దాడి యత్నం..
- పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- భారత దేశవ్యాప్తంగా రేపు కాంగ్రెస్ నిరసనలు
- యూఏఈలో ఇరాన్ ఎయిర్‌లైన్స్ విమానాలు నిలిపివేత.. తదుపరి ఆదేశాల వరకు సస్పెన్షన్







