విజయవాడ ‘వివేకానంద’లో సమ్మర్ క్యాంప్!
- April 22, 2026
విజయవాడ: ఆత్మవికాస్`2026, సమ్మర్ క్యాంప్‌లో భాగంగా ఈ నెల 27నుంచి మే 9వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. నగరంలోని గాంధీనగర్‌లో రామకృష్ణా మిషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘వివేకానంద సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్’లో 12రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. 4వ తరగతి నుంచి 9వ తరగతి చదువుతున్న పిల్లలకు ధ్యానం, యోగాసనాలు, వేద పఠనం, భజనలు, లీడర్‌షిప్ స్కిల్స్, చరిత్ర నిర్మాణం వంటివి ఇక్కడ నేర్పనున్నారు. ఉదయం 8.30గంటల నుంచి 11.30గంటల వరకు నిత్యం తరగతులుంటాయని నిర్వాహకులు తెలిపారు. సీట్లు పరిమితంగా ఉంటాయని, ఫీజు ఒకొక్కరికీ రూ.750 ధర నిర్ణయించామని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.


తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







