తెలంగాణ: ఆరుగురు సీనియర్ ఐపీఎస్ లకు పదోన్నతి
- April 22, 2026
తెలంగాణలో ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు దక్కాయి. వీరంతా 1995, 1996 బ్యాచ్ లకు చెందిన ఐపీఎస్ అధికారులు.., ప్రమోషన్ లు పొందిన అధికారుల్లో వీవీ శ్రీనివాస్ రావు (1995బ్యాచ్), స్వాతిలక్రా (1995 బ్యాచ్), మహేశ్ భగవత్ (1995 బ్యాచ్), చారుసిన్హా (1996 బ్యాచ్) డాక్టర్ అనిల్ కుమార్ (1996 బ్యాచ్), వీసీ సజ్జనార్ (1996 బ్యాచ్) ఉన్నారు.
వీరంతా అడిషనల్ డీజీ నుంచి డీజీలుగా పదోన్నతి పొందారు.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం (ఏప్రిల్ 22) ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం మహేశ్ భగవత్ లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా ఉన్నారు. స్వాతిలక్రా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగా ఇన్నాళ్లు కొనసాగుతున్నారు. వీవీ శ్రీనివాసరావు పోలీసు నియామక మండలి చైర్మన్ గా ఉన్నారు. చారుసిన్హా సీఐ మహిళా భద్రతా విభాగం, ఏసీబీ ఏడీజీగా కొనసాగుతున్నారు. అనిల్ కుమార్ గ్రేహౌండ్స్ ఏడీజీగా ఉన్నారు. వీసీ సజ్జనార్ హైదరాబాద్ సీపీగా కొనసాగుతున్నారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!







