సాక్ష్యంగా ఈమెయిల్.. BHD11,000 దావా కొట్టివేత..!!

- April 25, 2026 , by Maagulf
సాక్ష్యంగా ఈమెయిల్.. BHD11,000 దావా కొట్టివేత..!!

మనామా: సుమారు 11,000 బహ్రెయిన్ దినార్ల (BHD) విలువైన చెల్లించని ఇన్‌వాయిస్‌లకు సంబంధించిన వాణిజ్య వివాదాన్ని కోర్టు కొట్టివేసింది. ఆ మొత్తం ఇప్పటికే పూర్తిగా చెల్లించబడిందని ఈ మెయిర్ ద్వారా స్పష్టమైందని కోర్టు నిర్ధారించింది.

ఒక ప్లాస్టిక్స్ కంపెనీకి సరఫరా చేసిన ముడి పదార్థాలకు గాను సుమారు 11,057 బహ్రెయిన్ దినార్లు (BHD) తమకు అందలేదని పేర్కొంటూ ఒక సరఫరాదారు ఈ కేసును దాఖలు చేశారు. అయితే, బ్యాంకు బదిలీల ద్వారా బకాయిలన్నీ చెల్లించబడ్డాయని ప్రతివాది వాదించారు. ఇందుకు సంబంధించిన అన్ని బ్యాంకు రికార్డులను సమర్పించారు. చెల్లింపు అందినట్లు ధృవీకరిస్తూ దావాదారు కంపెనీ ప్రతినిధి పంపిన ఈమెయిల్‌తో పాటు, ఖాతాలో సున్నా నిల్వను చూపే అకౌంట్ స్టేట్‌మెంట్‌ను కూడా వారు సమర్పించారు. సాక్ష్యాలను సమీక్షించిన తర్వాత, కోర్టు ప్రతివాదికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

ఆ ఇమెయిల్.. అధికారిక పత్రాలతో సమానమైన, పూర్తి చట్టపరమైన ప్రామాణికత కలిగిన చెల్లుబాటు అయ్యే లిఖితపూర్వక రుజువు అని,  ఇది మోసం, పొరపాటు చేసినట్లు ఆధారాలు ఉంటే తప్ప దానిని సవాలు చేయడానికి వీలులేదని కోర్టు పేర్కొంది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com