యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?
- April 25, 2026
యూఏఈ: ప్రపంచ మార్కెట్ హెచ్చుతగ్గులకు అనుగుణంగా మే నెల కోసం యూఏఈలో పెట్రోల్ ధరలు వచ్చే వారం సవరించనున్నారు. ఏప్రిల్ నెలలో 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' మూసివేత మరియు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య కొనసాగుతున్న ప్రాంతీయ సైనిక ఘర్షణల కారణంగా చమురు ధరలు అధికంగా $90ల శ్రేణిలో మరియు బ్యారెల్కు $100 పైన నమోదయ్యాయి.
అమెరికా - ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించిన నేపథ్యంలో ముడి చమురు ధరలు కాస్త తగ్గాయి. కానీ ఆ రెండు దేశాలు తిరిగి సైనికపరమైన హెచ్చరికలు (rhetoric) చేసుకోవడంతో ధరలు మళ్ళీ $100 మార్కును దాటాయి.
ఫిబ్రవరి 28న మధ్యప్రాచ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత, మార్చి నెలలో చమురు ధరలు భారీగా పెరగడంతో... ఏప్రిల్ నెల కోసం యూఏఈలో పెట్రోల్ ధరలను 'ఇంధన ధరల కమిటీ' లీటరుకు సుమారు Dh0.80 మేర (దాదాపు మూడో వంతు) పెంచింది.
ఏప్రిల్ నెలలో సూపర్ 98, స్పెషల్ 95 మరియు ఈ-ప్లస్ రకాల పెట్రోల్ ధరలు వరుసగా లీటరుకు Dh3.39, Dh3.28 మరియు Dh3.20గా నిర్ణయించారు.
మార్చి నెలలో బ్యారెల్కు $96.96గా ఉన్న బ్రెంట్ ముడి చమురు సగటు ముగింపు ధర, ఏప్రిల్ నాటికి $99.16కు చేరింది. దీనిని బట్టి చూస్తే, ఇంధన ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై తుది నిర్ణయం కమిటీదే. సవరించిన ధరలను ఆ కమిటీ ఏప్రిల్ 30న అధికారికంగా ప్రకటించనుంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత, 2022లో యూఏఈ చరిత్రలోనే అత్యధిక పెట్రోల్ ధరలు నమోదయ్యాయి. ఆ సమయంలో దేశంలో పెట్రోల్ ధరలు లీటరుకు Dh4 మార్కును దాటడం అదే మొదటిసారి.
జూలై 2022లో పెట్రోల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఆ సమయంలో సూపర్ 98 ధర లీటరుకు Dh4.63గానూ, స్పెషల్ 95 ధర లీటరుకు Dh4.52గానూ నమోదయ్యాయి.
'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' మూసివేత మరియు ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా ప్రభావితమైన చమురు ఉత్పత్తి దేశాల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల... ప్రపంచ చమురు ధరలపై మధ్యప్రాచ్య ఘర్షణ ప్రభావం మరింత తీవ్రంగా పడింది. ఫిబ్రవరి చివరి నుండి హార్ముజ్ జలసంధి దాదాపుగా మూసివేయబడటం వల్ల, రోజుకు సుమారు 10 నుండి 13 మిలియన్ బ్యారెళ్ల చమురు సరఫరా (ఇది ప్రపంచ ఉత్పత్తిలో దాదాపు 12 శాతానికి సమానం) నిలిచిపోయింది. ఇది 1970ల నాటి చమురు సంక్షోభాల తర్వాత ఇంధన సఫ్లై కి ఏర్పడిన అత్యంత తీవ్రమైన అంతరాయానికి దారితీసింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?
- కువైట్ ఎయిర్పోర్ట్ T5 నుండి డైరెక్ట్ ఫ్లైట్స్.. జజీరా ఎయిర్వేస్
- ఖతార్ లో కమ్యూనిటీ రన్నింగ్ సెషన్లు ప్రారంభం..!!
- సంస్కరణల దిశగా రిమోట్ వర్క్.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆమోదం..!!
- సాక్ష్యంగా ఈమెయిల్.. BHD11,000 దావా కొట్టివేత..!!
- గూగుల్ పే, ఫోన్ పేలకు పోటీగా వాట్సాప్..
- ప్రధాని మోదీ పై ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు!
- ప్రధాని తెలంగాణ పర్యటనకు ముహుర్తం ఫిక్స్..
- గాజా యుద్ధం తర్వాత తొలి ఎన్నికలలో ఓటు వేయనున్న పాలస్తీనియన్లు









