ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు..
- April 25, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. వేసవి తీవ్రత దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో భానుడు ప్రతాపం చూపుతుండటంతో జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు.
రాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూలులో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాయలసీమ వ్యాప్తంగా మెజారిటీ ప్రాంతాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో తీవ్రమైన ఎండలతో పాటు ఉక్కపోత తోడవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
కేవలం రాయలసీమలోనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా 20కి పైగా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటేశాయి. కోస్తాంధ్రలోనూ ఎండల తీవ్రత పెరిగింది. రాజధాని అమరావతితో పాటు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లోనూ తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ







