షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్‌వర్క్ అరెస్టు..!!
- April 27, 2026
యూఏఈః అక్రమంగా డబ్బు సంపాదనే లక్ష్యంగా పలు మోసాలకు పాల్పడుతున్న ఒక క్రిమినల్ నెట్‌వర్క్‌ను షార్జా పోలీసులు ఛేదించారు. ఒకే తరహా మోసాలపై అనేక ఫిర్యాదులు రావడంతో అధికారులు దర్యాప్తు చేపట్టి, నలుగురు ఆఫ్రికన్ అనుమానితులను అరెస్టు చేశారు. ఆ ముఠా మొత్తం 3 మిలియన్ దిర్హమ్స్ వరకు మోసాలకు పాల్పడినట్లు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ కల్నల్ డాక్టర్ ఖలీఫా అల్ బుహైర్ తెలిపారు.
ఈ ముఠా షిప్పింగ్ మరియు బీమా కంపెనీల మాటున పార్శిళ్లు క్లియరెన్స్ పేరిట బాధితులను నమ్మించి, కస్టమ్స్ ఫీజులు లేదా బీమా ఛార్జీల వంటి సాకులతో డబ్బులు వసూలు చేసేవారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఒక షిప్పింగ్ బీమా కంపెనీకి సంబంధించిన డేటాను ఈ ముఠా చట్టవిరుద్ధంగా యాక్సెస్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. ఈ డేటా సాయంతో నిందితులు పలువురిని మోసం చేసినట్లు వెల్లడించారు. నేరస్థులకు అంతర్జాతీయంగా కూడా సంబంధాలు ఉన్నాయని దర్యాప్తులో వెల్లడైందని వివరించారు.
ఒక నిందితుడు విదేశాల నుండి కార్యకలాపాలను నిర్వహిస్తూ ఇతరులకు ఆదేశాలు జారీ చేసేవాడని, యూఏఈలో ఉన్నవారు నిధులను సేకరించి, ఏటీఎంల నుండి నగదును విత్‌డ్రా చేసుకునేవారని తెలిపారు.
అలాగే, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో నకిలీ ఖాతాల ద్వారా బాధితులను ఆకర్షించడానికి, వారిని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయడానికి నిందితులు మహిళల పేర్లు మరియు ఫోటోలను ఉపయోగించినట్లు దర్యాప్తులో వెల్లడైందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు పలు సూచనలు చేశారు. ఆన్ లైన్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ సమాచారాన్ని పంచుకోవద్దని పోలీసులు నివాసితులను హెచ్చరించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- UAE fuel prices for October 2026 announced
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్







