చేనేత రుణవిముక్తి కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం ...
- August 06, 2016
వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది చేనేత రంగంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, అలాంటి రంగం నేడు ధీనావస్థకు చేరుకుందని ఏపీ సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం అనంతపురం జిల్లా ధర్మవరంలో చేనేత రుణవిముక్తి కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. చేనేత కార్మికులు ఉపాధిలేక ఎన్నో అవస్థలు పడుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులకు రూ.110 కోట్లు ఒకే దఫాలో ఒకేరోజు విడుదల చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రాష్ట్ర విభజనతో అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధిపైనే దృష్టిసారిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఆనందంగా వుండాలన్నదే తమ లక్ష్యమన్నారు.
చేనేత పరిశ్రమ, చేనేత కార్మికులను పూర్తిగా ఆదుకొనే బాధ్యత పూర్తిగా ప్రభుత్వమే తీసుకుంటుందని చెప్పారు. ఈ ఏడాది నుంచి రాష్ట్రీయ స్వస్త్ బీమా పథకాన్ని అమలు చేస్తామన్నారు. చేనేత కార్మికుల కోసం చేనేత భవన్లు, నేత బజార్లు ఏర్పాటుచేసి వారి ఆర్థిక ఎదుగుదలకు తోడ్పాటునందిస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులున్నా రైతులకు రూ.24వేల కోట్లు, డ్వాక్రా సంఘాలకు రూ.10వేల కోట్లు రుణవిముక్తి కల్పించామని వెల్లడించారు. చరిత్రలో ఎప్పుడూ చేయని విధంగా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఒక్క అనంతపురంలోనే చేనేతలకు రూ.36కోట్లు రుణవిముక్తి కల్పించామన్నారు.అనంతపురం జిల్లాలోని వేరుశెనగ ప్రపంచ మార్కెట్‌కు వెళ్లేలా చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో అన్ని పరిశ్రమలు అనంతపురానికే వస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ మంత్రులు కొల్లు రవీంద్ర, పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు, హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు







