అక్కినేని అందగాళ్లు ఒకే సినిమాలో ..
- August 06, 2016
మనం సినిమా తరువాత మరోసారి అక్కినేని అందగాళ్లు ఒకే సినిమాలో కలిసి నటించేందుకు రెడీ అవుతున్నారు. మనం సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య, అఖిల్ లు కూడా ఒకేసారి తెర మీద కనిపించి అక్కినేని అభిమానులకు కనుల విందు చేశారు. ఇప్పుడు మరోసారి వెండితెర మీద ఒకేసారి కనిపించేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ సారి నాగ్ లేకుండా వారసులిద్దరూ కలిసి ఓ సినిమాలో గెస్ట్ అపియరెన్స్ ఇవ్వనున్నారు.అక్కినేని ఫ్యామిలీ నుంచే వచ్చిన మరో యంగ్ హీరో సుశాంత్ సినిమాలో అఖిల్, నాగచైతన్యలు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. నాగచైతన్య చిన్న పాత్రలో నటిస్తుండగా.., అఖిల్ ఓ పాటలో సుశాంత్ తో కలిసి స్టెప్పేయనున్నాడు. చాలా రోజులుగా హీరోగా ప్రూవ్ చేసుకోవటం కోసం కష్టాలు పడుతున్న బావ కోసం అఖిల్, నాగచైతన్యలు ఈ నిర్ణయం తీసుకున్నారట. మరి అక్కినేని అందగాళ్లు సుశాంత్ కు సక్సెస్ ఇస్తారో లేదో చూడాలి.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







