హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- April 27, 2026
అనంతపురం: జిల్లాలో వెలుగులోకి వచ్చిన హనీట్రాప్ కేసు పెద్ద సంచలనానికి దారితీసింది. ఈ కేసులో పోలీసు సిబ్బంది ప్రమేయం ఉన్నట్టు తేలడంతో ఉన్నతాధికారులు కఠిన చర్యలు చేపట్టారు. మొత్తం 9 మంది పోలీసు అధికారులు, సిబ్బందిపై వేటు వేయడం గమనార్హం.
అనంతపురం రేంజ్ ఐజీ, కర్నూలు రేంజ్ డీఐజీ, అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ సంయుక్తంగా ఉత్తర్వులు జారీ చేశారు. రాప్తాడు సీఐ శ్రీహర్ష, అనంతపురం రూరల్ హెడ్ కానిస్టేబుల్ గిరి, కానిస్టేబుల్ దుర్గాప్రసాద్, ఇటుకలపల్లి కానిస్టేబుల్ దేవలానాయక్‌లను సర్వీసు నుంచి తొలగించారు.
అదే విధంగా అనంతపురం రూరల్ ఎస్ఐ రాంబాబు, కానిస్టేబుళ్లు దేవేంద్ర, జయరాం నాయక్‌లను సస్పెండ్ చేశారు. మరోవైపు అనంతపురం రూరల్ సీఐ శేఖర్‌ను కర్నూలు రేంజ్ డీఐజీకి అటాచ్ చేశారు.
ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురు నిందితులను రిమాండ్‌కు పంపినట్లు అధికారులు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రూ.13 లక్షల నగదు, 2 కత్తులు, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరికొంతమందిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
హనీట్రాప్ ముఠాతో పోలీసుల సంబంధాలు బయటపడటాన్ని అనంతపురం డీఐజీ షిమోషి, ఎస్పీ జగదీశ్ తీవ్రంగా పరిగణించారు. పెద్ద సంఖ్యలో బాధితులు ముందుకు రావడం, ముఖ్యంగా పోలీసు శాఖలోనే ఉన్న కొందరు అధికారుల ప్రమేయం నిర్ధారణ కావడంతో ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, కేసుపై మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!







