బీమా రంగంలో నగదు లావాదేవీలపై నిషేధం..!!
- April 27, 2026
కువైట్: బీమా రంగంలో పారదర్శకతను మరియు ఆర్థిక పర్యవేక్షణను బలోపేతం చేసే లక్ష్యంతో కువైట్ బీమా నియంత్రణ విభాగం తన పర్యవేక్షణలో ఉన్న అన్ని సంస్థలలో నగదు లావాదేవీలపై నిషేధం విధించారు.
కొత్త నిర్ణయం ప్రకారం, బీమా కంపెనీలు మరియు లైసెన్స్ పొందిన సంస్థలు ఎలాంటి నగదు చెల్లింపులను స్వీకరించడం లేదా నిర్వహించడం కుదరదు. బదులుగా, ఇప్పటికే ఉన్న నిబంధనలకు అనుగుణంగా అన్ని ఆర్థిక లావాదేవీలు తప్పనిసరిగా బ్యాంకింగ్ లేదా కువైట్ సెంట్రల్ బ్యాంక్ ఆమోదించిన ఎలక్ట్రానిక్ చెల్లింపు పద్ధతుల ద్వారానే జరగాలి.
అయితే, కొన్ని తప్పనిసరి వాహన బీమా లావాదేవీలకు, సరిహద్దులో వ్యక్తిగత బీమా పత్రాలకు పరిమిత మినహాయింపును ప్రకటించారు.
ముఖ్యంగా మనీలాండరింగ్, ఉగ్రవాదానికి నిధుల సమకూర్చడాన్ని ఎదుర్కోవడానికి కువైట్ విస్తృత ప్రయత్నాలకు అనుగుణంగా ఈ మేరకు నిషేధం విధించినట్టు స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- UAE fuel prices for October 2026 announced
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్







