'గోదారి గట్టుపైన' అందరూ రిలేట్ అయ్యే బ్యూటిఫుల్ మూవీ: హీరో సుమంత్ ప్రభాస్
- April 27, 2026
-సుమంత్ ప్రభాస్, సుభాష్ చంద్ర, అభినవ్ రావు, రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ 'గోదారి గట్టుపైన' బ్యూటిఫుల్ లవ్ స్టొరీ & రూరల్ ఫ్యామిలీ డ్రామా ట్రైలర్ లాంచ్
యంగ్ హీరో సుమంత్ ప్రభాస్, రొమాన్స్, కామెడీ, కుటుంబ భావోద్వేగాలతో కూడిన ఆహ్లాదకరమైన రూరల్ డ్రామా 'గోదారి గట్టుపైన'తో ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు. నూతన దర్శకుడు సుభాష్ చంద్ర దర్శకత్వంలో, రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో నిధి ప్రదీప్ కథానాయికగా నటించగా, జగపతి బాబు కథకు బలాన్ని చేకూర్చే కీలక పాత్రలో కనిపించారు. టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చిత్ర బృందం ఇప్పుడు ట్రైలర్‌ను విడుదల చేసింది.
ఈ కథ రాజు అనే సాధారణ ఆటో డ్రైవర్, అతని ఆటోలో ప్రతిరోజూ ప్రయాణించే కాలేజ్ అమ్మాయి మాయ మధ్య సాగే మధురమైన ప్రేమకథ. మొదట నిశ్శబ్దమైన అభిమానం తర్వాత ప్రేమగా మారుతుంది. మాయ కూడా అతని ప్రేమను అంగీకరిస్తుంది. కానీ వారి ప్రయాణం అంత సులభం కాదు. మాయ తండ్రి అనుమతి పొందడం రాజుకు పెద్ద సవాలుగా మారుతుంది. దీంతో వారి ప్రేమ ఒక ఎమోషనల్ ఫైట్ గా మారుతుంది.
సుమంత్ ప్రభాస్ గ్రామీణ యువకుడి పాత్రలో సహజంగా ఒదిగిపోయి, గోదావరి యాసతో ఆకట్టుకున్నారు. మాయగా నిధి ప్రదీప్ ఫ్రెష్‌గా కనిపిస్తూ, ప్రేమ, తండ్రి మధ్య డైలమాలో ఉన్న భావోద్వేగాన్ని చక్కగా చూపించారు. జగపతి బాబు టఫ్, అదే సమయంలో ప్రేమగల తండ్రిగా ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. లైలా ఆయన భార్యగా భావోద్వేగానికి బలం చేకూర్చారు. సుదర్శన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ మంచి కామెడీ జోడించారు.
దర్శకుడు సుభాష్ చంద్ర సహజమైన గ్రామీణ ప్రేమకథను కుటుంబ భావోద్వేగాలతో కలిపి వినోదాత్మకంగా మలిచారు. ప్రేమ కథతో పాటు, తండ్రి-కూతురు భావోద్వేగం హైలెట్ గా నిలిచింది.
సినిమాటోగ్రాఫర్ సాయి సంతోష్ గోదావరి అందాలను అద్భుతంగా చూపించగా, నాగ వంశీ కృష్ణ సంగీతం కథను మరింత ఎలివేట్ చేస్తోంది. ప్రొడక్షన్ డిజైనర్ ప్రవల్య, ఎడిటర్ అనిల్ కుమార్ పి తమ వర్క్ తో సినిమాకు మంచి విజువల్ రిచ్‌నెస్ తీసుకువచ్చారు.
‘గోదారి గట్టుపైన’ యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకోనుందని ట్రైలర్ ప్రామిస్ చేస్తోంది. ఈ చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. “మేము ‘ఫేమస్’ సినిమాకు మీరు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. ఈ సినిమాకి కూడా అలాగే ఆదరణ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను పుట్టి పెరిగింది తెలంగాణ. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా గోదారి యాస నేర్చుకుని మాట్లాడాను. ప్రతి డైలాగ్‌ను సహజంగా చెప్పడానికి ప్రయత్నించాను. ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమా ఇంత బాగా రావడానికి మా డైరెక్టర్ , టీమ్ కారణం. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. నిధి కూడా చాలా చక్కగా తెలుగు నేర్చుకుని మాట్లాడింది, చాలా హార్డ్ వర్క్ చేసింది. రాజీవ్ కనకాల గారు, దేవి ప్రసాద్ గారు, శ్రీవాణి గారికి థాంక్స్. వారితో కలిసి నటించడం చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. జగపతిబాబు గారితో పని చేయడం గొప్ప అనుభవం. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. నిర్మాత అభినవ్ గారు సినిమాను ఎంతో అద్భుతంగా నిర్మించారు. రెడ్ పపెట్ ప్రొడక్షన్స్ చాలా పెద్ద స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. కృష్ణపట్నం ఫుడ్ ఎంత టేస్టీగా ఉంటుందో, మా సినిమా కూడా అంత క్యూట్‌గా ఉంటుంది. ఈ ట్రైలర్‌లో మీరు చూసింది సినిమాలో ఉంటుంది. సినిమాలో ఉన్నదే మన జీవితంలో ఉంటుంది. ఇది పూర్తిగా రిలేట్ అయ్యే సినిమా. గోదావరి ప్రాంతం చాలా అందంగా ఉంటుంది. అక్కడి లొకేషన్స్ నాకు కేరళ కంటే అందంగా అనిపించాయి. మే8న మీ ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను చూడండి. గోదావరిలో పడితే బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది… కానీ మా ‘గోదారి గట్టుపైన’ ప్రేమలో పడితే బయటకు రావడం కష్టం. అంతగా మీరు సినిమాను ప్రేమిస్తారు. ఈ సమ్మర్ లో సినిమా అందరికీ కూల్ వైబ్ ఇస్తుంది.
డైరెక్టర్ సుభాష్ చంద్ర మాట్లాడుతూ.. ఈ ట్రైలర్ మీకు నచ్చడం చాలా ఆనందంగా ఉంది. తరాలు మారినా ప్రేమ మాత్రం మారదు. ఇందులో ప్రేమికుల ప్రేమతో పాటు తండ్రి-కూతురు ప్రేమను చూపించాం. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుడి ముఖంలో చిరునవ్వు ఉంటుంది. మా ‘గోదారి గట్టుపైన’ ఈ వేసవిలో ఒక చలివేంద్రంలాంటిది. నా మొదటి సినిమానే అయినా గొప్ప ఆర్టిస్టులతో పని చేసే అవకాశం దొరికింది. జగపతిబాబు గారు, రాజీవ్ కనకాల గారు, దేవి ప్రసాద్ గారు, హర్షవర్ధన్ గారు అందరూ అద్భుతంగా నటించారు. మా నటీనటులు మిమ్మల్ని నవ్విస్తారు, కవ్విస్తారు, మురిపిస్తారు, ఏడిపిస్తారు కూడా — ఇది నా గ్యారెంటీ. ఈ సినిమా మొత్తం రియల్ లొకేషన్స్‌లో తీశాం. అభినవ్ గారు అద్భుతంగా నిర్మించారు. మే 8న మీరు ఒక అందమైన సినిమాను చూడబోతున్నారు.
ప్రొడ్యూసర్ అభినవ్ రావు మాట్లాడుతూ.. ఈ ఈవెంట్‌కి వచ్చిన అందరికీ థాంక్స్. సుభాష్ చాలా అద్భుతంగా సినిమా తీశాడు. అవుట్‌పుట్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను. సుమంత్ అద్భుతంగా నటించాడు. చివరి 40 నిమిషాలు చాలా భావోద్వేగంగా ఉంటాయి. మే 8 తర్వాత ఈ సినిమా గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడుకుందాం.
హీరోయిన్ నిధి ప్రదీప్ మాట్లాడుతూ.. ఈ సినిమా నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవం. ‘మాయ’ పాత్ర అందరికీ నచ్చుతుంది. జగపతిబాబు గారు, లైలా గారు, సుమంత్ గారితో పని చేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఇది ఒక నీట్ అండ్ క్లీన్ ఫిల్మ్. ఈ సమ్మర్‌లో మీ మూడ్‌ను కూల్ చేస్తుంది.”
రేణు మాట్లాడుతూ..ఈ సినిమాలో మహాలక్ష్మి పాత్ర చేశాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. మంచి టీంతో పని చేయడం ఆనందంగా ఉంది. నా పాత్ర ప్రేక్షకులకు దగ్గరగా అనిపిస్తుంది.
రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. థియేటర్‌లో ఏసీ లేకపోయినా ఈ సినిమా చుస్తున్నప్పుడు చల్లగా అనిపిస్తుంది . ఇది గ్యారెంటీ. ట్రైలర్ చాలా బాగుంది. సుభాష్ మంచి పాత్ర ఇచ్చారు. అభినవ్ రావు మంచి నిర్మాత. ఈ ప్రొడక్షన్ హౌస్ పెద్ద స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. సుమంత్ అద్భుతంగా నటించాడు.”
దేవి ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నాకు మంచి పాత్ర ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. సుభాష్ భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చేస్తాడు. ఇలాంటి నిర్మాతలు పరిశ్రమకు అవసరం. జగపతిబాబు గారితో పని చేయడం ఆనందంగా ఉంది. గోదావరి ప్రాంతంలో షూటింగ్ చేసిన అనుభవం చాలా ప్రత్యేకం.”
రాజ్‌కుమార్ కసిరెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమా చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. చూసిన తర్వాత మీకు గుర్తుండిపోతుంది. మా టీమ్ అందరికీ ధన్యవాదాలు.
సుదర్శన్ మాట్లాడుతూ. ఈ సినిమా చూస్తే ఒక గ్రామానికి వెళ్లిన ఫీలింగ్ వస్తుంది. జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఇందులోని క్యారెక్టర్స్ మీ ఫ్రెండ్స్‌లా అనిపిస్తారు. కామెడీ, ఎమోషన్ అన్నీ మీకు బాగా కనెక్ట్ అవుతాయి. సుభాష్ చాలా కష్టపడ్డాడు. నిధి అచ్చమైన తెలుగు అమ్మాయిలా నటించింది. సుమంత్ నటనతో పాటు ప్రమోషన్స్‌లో కూడా ఎంతో కేర్ తీసుకున్నాడు. ఈ సినిమాతో మంచి విజయం రావాలని కోరుకుంటున్నాను.
తారాగణం: సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్, జగపతి బాబు, రాజీవ్ కనకాల, లైలా, దేవి ప్రసాద్, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ్, రోహిత్ కృష్ణ వర్మ
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం - సుభాష్ చంద్ర
బ్యానర్ - రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్
నిర్మాత - అభినవ్ రావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - మధులిక సంచన లంక
DOP - సాయి సంతోష్
సంగీతం - నాగ వంశీ కృష్ణ
ఎడిటర్ - అనిల్ కుమార్ పి
సౌండ్ డిజైనర్ - నాగార్జున తాళ్లపల్లి
ప్రొడక్షన్ డిజైనర్ - ప్రవల్య డి
PRO - వంశీ-శేఖర్
మార్కెటింగ్ - ఫస్ట్ షో
తాజా వార్తలు
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్‌లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు
- శాంతికి రష్యా కృషి…పుతిన్ కీలక ప్రకటన
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై స్పష్టత: ఎంపీ బాలశౌరి
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్‌లో మంత్రి సత్యకుమార్‌తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!









