రద్దీ ప్రాంతాల్లోనే ఎక్కువ ట్రాఫిక్ ఉల్లంఘనలు
- August 06, 2016
కమర్షియల్ స్ట్రీట్స్, అలాగే జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ఎక్కువగా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. వీటిల్లో ఎక్కువగా వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ ఉపయోగించడం, డ్రైవింగ్ చేస్తున్న సమయంలో సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటివి చేస్తున్నారు వాహనదారులు. ఈ విషయాల్ని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, మీడియా అండ్ ట్రాఫిక్ అవేర్‌నెస్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ మేజర్ జబెర్ మొహమ్మద్ రషీద్ ఒదైబా వివరించారు. ఈ నేపథ్యంలో మరింత ఎక్కువగా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహనా కార్యక్రమాల్ని చేపడ్తామని ఆయన అన్నారు. అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో ముఖ్య ఉద్దేశ్యం ప్రమాదాల్ని తగ్గించడమేనని ఆయన వెల్లడించారు. జులై 24న ప్రారంభించిన ఈ క్యాంపెయిన్ ఈ వేసవి అంతా కొనసాగనుంది. సీట్ బెల్ట్ వినియోగించకపోవడం వల్ల ఎక్కువమంది ప్రాణాలు కోల్పోతున్నారనీ, సీట్ బెల్ట్ వినియోగిస్తే ప్రమాదాలు జరిగినా చిన్న చిన్న గాయాలతో బయటపడవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







