అల్‌ బెలౌషికి కేరళీయుల నివాళి

- August 06, 2016 , by Maagulf
అల్‌ బెలౌషికి కేరళీయుల నివాళి

200 మందికి పైగా విమాన ప్రయాణీకులు, సిబ్బందిని కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాల్ని కోల్పోయిన ఫైర్‌ ఫైటర్‌ అల్‌ బెలౌషికి ఘనంగా కేరళీయులు నివాళి అర్పించారు. దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేరళ నుంచి వచ్చిన ఎమిరేట్స్‌ విమానం క్రాష్‌ ల్యాండ్‌ అయిన ఘటనలో అల్‌ బలౌషి వీరోచితంగా వ్యవహరించారు. తన ప్రాణాల్ని లెక్కచేయకుండా విమానంలో ఉన్నవారిని రక్షించేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో విమానంలో ఉన్నవారెవరూ ప్రాణాలు కోల్పోలేదు. దురదృష్టవశాత్తూ మంటల్లో చిక్కుకుని ఫైర్‌ ఫైటర్‌ అల్‌ బలౌషి మృతి చెందారు. విమానంలో ఉన్నవారంతా కేరళీయులే. దాంతో, దుబాయ్‌లోని కేరళ కమ్యూనిటీ తమ హీరోగా, తమను రక్షించిన దేవుడిగా అల్‌ బలౌషిని కొనియాడుతున్నారు. బలౌషి కుటుంబ సభ్యుల్ని కలిసి, వారిని ఓదార్చారు. వాట్సాప్‌ ద్వారా కేరళ కమ్యూనిటీ, ఓ అవగాహనకు వచ్చి బలౌషి కుటుంబాన్ని కలవాలని నిర్ణయించుకున్నా, పొలిటికల్‌ ఇబ్బందుల కారణంగా కేవలం నలుగురు ప్రతినిథులు మాత్రమే వెళ్ళారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com