ఎగ్జిట్ పోల్స్ కౌంట్‌డౌన్ షురూ.. మే 4న తుది ఫలితాలు
- April 29, 2026
ఎగ్జిట్ పోల్స్ కౌంట్‌డౌన్ షురూ.. మే 4న తుది ఫలితాలు
న్యూ ఢిల్లీ: తమిళనాడు, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెల్లడి పై ఉన్న నిషేధం నేటితో ముగియనుంది. పశ్చిమ బెంగాల్లో రెండో దశ పోలింగ్ ముగిసిన వెంటనే, అంటే ఏప్రిల్ 29 (బుధవారం) సాయంత్రం 6:00 గంటల పీపుల్ పల్స్ సర్వే సంస్థ తమ అంచనాలను ప్రకటించనుంది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం, పోలింగ్ పూర్తిగా ముగిసే వరకు ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేయకుండా ఈ నిషేధం అమలులో ఉంది.
తమిళనాడులో ‘విజయ్’ ఫ్యాక్టర్.. త్రిముఖ పోరు?
అన్ని రాష్ట్రాల కంటే తమిళనాడు ఫలితాలపై దేశవ్యాప్తంగా భారీ ఉత్కంఠ నెలకొంది. అధికార డీఎంకే (DMK), ప్రతిపక్ష అన్నాడీఎంకే (AIADMK) మధ్య దశాబ్దాలుగా సాగుతున్న పోరులో ఈసారి నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) సరికొత్త సమీకరణాలకు తెరలేపింది. విజయ్ తన తొలి ఎన్నికల్లోనే ఒంటరిగా బరిలోకి దిగడం, డీఎంకే సర్కారుపై నేరుగా విమర్శలు గుప్పించడం ఓటర్లను ఏ మేరకు ఆకట్టుకుందోనని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.
Exit Polls 2026: మే 4న అసలు సిసలైన తీర్పు
ఈ ఐదు రాష్ట్రాల భవితవ్యం మే 4, 2026 (సోమవారం) నాడు తేలనుంది. ఆ రోజు ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఎగ్జిట్ పోల్స్ కేవలం అంచనాలు మాత్రమే అయినప్పటికీ, అవి ఫలితాల దిశను సూచిస్తాయి. కేరళలో ఎల్డీఎఫ్ (LDF) పరంపర కొనసాగుతుందా? బెంగాల్లో దీదీ హ్యాట్రిక్ కొడతారా? అస్సాం, పుదుచ్చేరిలలో ఎవరి జెండా ఎగురుతుంది? వంటి ప్రశ్నలకు సోమవారం సాయంత్రం కల్లా స్పష్టమైన సమాధానం దొరకనుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ







