భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!

- April 30, 2026 , by Maagulf
భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!

యూఏఈ: భారత్, యూఏఈ మధ్య విమాన సర్వీసులు క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నాయి. ఈ క్రమంలో విమాన ఛార్జీలు మాత్రం అధికంగానే ఉంటున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. దీంతో ప్రయాణానికి సాధారణ సమయంలో కంటే ఎక్కువ చెల్లిస్తున్న చాలా మంది యూఏఈ నివాసితులు తెలిపారు.

ప్రస్తుతం ఛార్జీలు సాధారణం కంటే 30 నుండి 35 శాతం ఎక్కువగా ఉన్నాయని ట్రావెల్ ఏజెంట్లు తెలిపారు. "సాధారణంగా భారత్-యూఏఈ ప్రయాణాలకు ఏప్రిల్ నెల తక్కువ రద్దీ ఉండే సమయం. కానీ పెరిగిన ఇంధన ధరలు, పరిమిత సామర్థ్యం కారణంగా ప్రస్తుతం ఛార్జీలు సాధారణం కంటే 30 నుండి 35 శాతం ఎక్కువగా ఉన్నాయి." అని ప్లూటో ట్రావెల్స్ మేనేజింగ్ పార్టనర్ భరత్ ఐదాసాని అన్నారు.

విమానాలు ఇప్పటికీ వాటి సాధారణ సామర్థ్యం కంటే ఎక్కువ స్థాయిలో నడుస్తున్నాయని, దీనివల్లే ధరలు అధికంగానే ఉంటున్నాయని ఆయన తెలిపారు. "కొన్ని మార్గాల్లో అందుబాటులో ఉన్న సీట్ల కంటే డిమాండ్ ఎక్కువగా ఉంది. అందుకే ఛార్జీలు ఇప్పటికీ అధికంగా ఉన్నాయి." అని ఆయన అన్నారు.

కొన్ని నెలల క్రితం Dh300 నుండి Dh400 వరకు తక్కువగా ఉన్న ఛార్జీలు ఈ కాలంలో విపరీతంగా పెరిగాయని ఆపరేటర్లు తెలిపారు. " కొన్ని మార్గాల్లో ఛార్జీలు Dh300 నుండి Dh400 వరకు ఉండేవి. విమానాలకు అంతరాయం కలిగిన తర్వాత ధరలు Dh2,000 దాటాయి. ఇప్పుడు అవి కొద్దిగా తగ్గాయి, కానీ ఇప్పటికీ వన్-వేకి Dh1,300 నుండి Dh1,800 వరకు ఉన్నాయి." అని వైజ్ ఫాక్స్ టూరిజం సీనియర్ మేనేజర్ సుబైర్ తెకెపురత్వలప్పిల్ అన్నారు.

మార్గం మరియు ప్రయాణ తేదీలను బట్టి రిటర్న్ ఛార్జీలు కూడా అధికంగానే ఉన్నాయి. "కొన్ని మార్గాల్లో రిటర్న్ టిక్కెట్లు Dh2,000 నుండి Dh2,500 వరకు పెరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో రద్దీ తేదీలలో ఇంకా ఎక్కువగా ఉంటున్నాయి." అని ఆయన అన్నారు.

అయితే, అధిక ధరలు ఉన్నప్పటికీ, ప్రయాణ డిమాండ్ తగ్గలేదన్నారు. "ప్రజలు ఇప్పటికీ ప్రయాణిస్తున్నారు. యూఏఈ నుండి భారత్, భారత్ నుండి యూఏఈకి కూడా రాకపోకలు అధికంగా ఉన్నాయి." అని సుబేర్ తెలిపింది. అధిక ధరలకు విమానయాన సంస్థల ఎంపికలు పరిమితంగా ఉండటం కూడా ఒకటని ఆపరేటర్లు పేర్కొన్నారు.  

కాగా, దక్షిణ భారత గమ్యస్థానాలు.. ముఖ్యంగా కొచ్చి, ప్రస్తుతం అత్యంత ఖరీదైన వాటిలో ఉన్నాయని తెలిపారు. "ముంబై మరియు ఢిల్లీకి ఛార్జీలు కొన్ని తేదీలలో Dh1,000 నుండి Dh1,500 వరకు ఉన్నాయి. కానీ కొచ్చికి ఛార్జీలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. తరచుగా Dh2,000 దాటుతున్నాయి." అని సుబైర్ తెలిపారు. కొచ్చికి రానుపోను ఛార్జీలు ఇంకా ఎక్కువగా ఉండవచ్చని కూడా ఆయన అన్నారు. "ఉదాహరణకు, మే 1వ తేదీ ప్రాంతంలో ప్రయాణానికి కొచ్చికి రానుపోను ఛార్జీలు Dh4,114 వరకు ఉంటున్నాయి," అని ఆయన చెప్పారు.

స్వల్పకాలంలో ఛార్జీలు పెద్దగా తగ్గకపోవచ్చని, సమ్మర్ సెలవుల కాలం నేపథ్యంలో ఛార్జీలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని ట్రావెల్ ఏజెంట్లు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com