హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- April 30, 2026
మస్కట్: శ్వాసకోశ వ్యాధులను ఎదుర్కోవడానికి అధిక-ఖచ్చితత్వ సేవలను విస్తరించే ప్రయత్నంలో భాగంగా రాయల్ హాస్పిటల్ ఇటీవల మెడికల్ థొరాకోస్కోపీ సేవను ప్రారంభించింది. ఇది ఒక అధునాతన నిర్ధారణ మరియు చికిత్సా విధానమని డాక్టర్లు తెలిపు.
రాయల్ హాస్పిటల్, శ్వాసకోశ వ్యాధుల విభాగాధిపతి మరియు సీనియర్ కన్సల్టెంట్ అయిన డాక్టర్ యాకూబ్ సలాం అల్ హధ్రమీ మాట్లాడుతూ.. ఈ కొత్త సేవ ప్రారంభంతో వారానికి 2 నుండి 4 కేసుల చొప్పున ఈ రకమైన ప్రక్రియను నిర్వహించడానికి మార్గం సుగమమవుతుందని తెలిపారు.
శస్త్రచికిత్స అవసరాన్ని తొలగించడంతోపాటు పేషంట్ ఆసుపత్రిలో ఉండే సమయాన్ని కేవలం కొన్ని గంటలకు తగ్గిస్తుందన్నారు. అతి తక్కువ మత్తుమందు (2-3 సెం.మీ. కోత) అవసరమయ్యే ఒక ఎండోస్కోపిక్ సేవగా ఈ ప్రక్రియ ఆవిర్భవించిందని ఆయన వివరించారు. దీనికి భిన్నంగా సర్జికల్ ఎండోస్కోపీలో రోగి పూర్తి మత్తులో ఆసుపత్రిలో చాలా రోజులు ఉండవలసి వస్తుందని పేర్కొన్నారు.
కారణం తెలియని ఊపిరితిత్తుల లేదా ప్లూరల్ వ్యాధుల నిర్ధారణ వంటి అత్యంత సాధారణ కేసులకు ఈ ప్రక్రియ ద్వారా ప్రయోజనం ఉంటుందని డాక్టర్ యాకూబ్ తెలిపారు. థొరాకోస్కోపీని ప్రవేశపెట్టడం అనేది ఒమన్ లో శ్వాసకోశ వ్యవస్థ రోగులకు అందించే సేవల స్థాయిలో ఒక మైలురాయిని నెలకొల్పిందని ఆయన చెప్పారు. ఈ వైద్య సాంకేతికత రాయల్ హాస్పిటల్ అధునాతన ప్రత్యేక సేవలకు కేంద్రంగా మారుతుందని డాక్టర్ యాకూబ్ అన్నారు. ఒమన్ సుల్తానేట్‌లో ఈ అధునాతన ప్రక్రియ (థొరాకోస్కోపీ)ను ప్రారంభించిన మొట్టమొదటి ప్రభుత్వ ఆసుపత్రి రాయల్ హాస్పిటల్ అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







