ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- April 30, 2026
మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిక్లియా క్రాసింగ్ వద్ద పెట్రోల్ పంప్ సమీపంలో జరిగిన ప్రమాదంలో 15 మంది కూలీలు దుర్మరణం చెందారు. మరో 20మందికి గాయాలయ్యాయి. వీరికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నాయి. అయితే, వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
బుధవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న పికప్ వాహనం కారును ఢీకొట్టి అదుపు తప్పి పల్టీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ క్రమంలో వ్యాన్‌లో ఉన్న 15మందికి తీవ్ర గాయాలు కావడంతో మరణించారు. మృతుల్లో ఏడుగురు మహిళలు ఉన్నట్లు సమాచారం.
ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. వాహనం అతివేగంతోపాటు.. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. వాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో లోపల ఉన్న కూలీలు వాహనం కింద పడి నలిగిపోయారు.
ఈ ఘోర ప్రమాద ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ‘ఎక్స్’ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాను. ధార్‌కు వెళ్లి చికిత్స ఏర్పాట్లు పర్యవేక్షించాలని ఇండోర్ డివిజనల్ కమిషనర్, ఐజీకి సూచనలు ఇచ్చాం. గాయపడిన వారందరికీ ఉచిత చికిత్స అందుతుంది. దేవుడు మృతుల ఆత్మలకు శాంతి కలిగించాలి. బాధలో ఉన్న వారి కుటుంబాలకు ధైర్యం ఇవ్వాలి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం









