ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..

- May 01, 2026 , by Maagulf
ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..

అబూదాబి: ప్రస్తుత ప్రాంతీయ పరిణామాల నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్, లెబనాన్, ఇరాక్ దేశాలకు యూఏఈ పౌరుల ప్రయాణాలను నిషేధిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MoFA) ప్రకటించింది.

అలాగే ప్రస్తుతం ఈ మూడు దేశాల్లో ఉన్న యూఏఈ పౌరులు వెంటనే స్వదేశానికి తిరిగి రావాలని మంత్రిత్వ శాఖ సూచించింది. విదేశాల్లో ఉన్న తమ పౌరుల భద్రత, సంక్షేమాన్ని కాపాడడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసే సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని పౌరులను కోరింది. ఇరాన్, లెబనాన్, ఇరాక్‌లలో ఉన్న యూఏఈ పౌరులు అత్యవసర సహాయం కోసం +97180044444 నంబర్ ద్వారా మంత్రిత్వ శాఖను సంప్రదించాలని సూచించింది.

పౌరుల భద్రతను అత్యంత ప్రాధాన్యంగా భావిస్తూ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు యూఏఈ ప్రభుత్వం స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com