ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- May 01, 2026
అబూదాబి: ప్రస్తుత ప్రాంతీయ పరిణామాల నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్, లెబనాన్, ఇరాక్ దేశాలకు యూఏఈ పౌరుల ప్రయాణాలను నిషేధిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MoFA) ప్రకటించింది.
అలాగే ప్రస్తుతం ఈ మూడు దేశాల్లో ఉన్న యూఏఈ పౌరులు వెంటనే స్వదేశానికి తిరిగి రావాలని మంత్రిత్వ శాఖ సూచించింది. విదేశాల్లో ఉన్న తమ పౌరుల భద్రత, సంక్షేమాన్ని కాపాడడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసే సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని పౌరులను కోరింది. ఇరాన్, లెబనాన్, ఇరాక్లలో ఉన్న యూఏఈ పౌరులు అత్యవసర సహాయం కోసం +97180044444 నంబర్ ద్వారా మంత్రిత్వ శాఖను సంప్రదించాలని సూచించింది.
పౌరుల భద్రతను అత్యంత ప్రాధాన్యంగా భావిస్తూ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు యూఏఈ ప్రభుత్వం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







