ఈ ఆదివారం నుంచి జజీరా ఎయిర్వేస్ పూర్తిస్థాయి సేవలు పునఃప్రారంభం
- May 01, 2026
కువైట్ సిటీ: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్-5 నుంచి జజీరా ఎయిర్వేస్ తన పూర్తిస్థాయి విమాన సేవలను ఈ ఆదివారం నుంచి తిరిగి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ప్రతిరోజూ ఉదయం 6:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
గత వారం నుంచి పాక్షికంగా విమాన సర్వీసులు ప్రారంభమైనప్పటికీ, ఈ ఆదివారం నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు ఎయిర్‌లైన్ సీఈఓ భరతన్ పశుపతి కువైట్ వార్తా సంస్థకు వెల్లడించారు.
టెర్మినల్-5 కార్యకలాపాలు పూర్తిగా అందుబాటులోకి రావడంతో, కువైట్ నుంచి నేరుగా 27 నగరాలకు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులను నడపనుంది.
ప్రయాణికులు విమాన సమయానికి కనీసం కొన్ని గంటల ముందుగానే జజీరా ఎయిర్వేస్ ‘పార్క్ అండ్ ఫ్లై’ (Park & Fly) టెర్మినల్‌కు చేరుకోవాలని అధికారులు సూచించారు. అక్కడ చెక్-ఇన్ మరియు బోర్డింగ్ ప్రక్రియలు పూర్తి చేసిన అనంతరం ప్రయాణికులను టెర్మినల్-5కు తరలిస్తామని వెల్లడించారు.
పూర్తిస్థాయి సేవల పునఃప్రారంభంతో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందనున్నాయని జజీరా ఎయిర్వేస్ పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







