మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- May 01, 2026
మల్కాజిగిరి: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారిణి బి.సుమతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
మల్కాజిగిరికి తొలి మహిళా పోలీస్ కమిషనర్‌గా నియమించబడటం ఆనందంతో పాటు బాధ్యతగా భావిస్తున్నానని సీపీ సుమతి తెలిపారు. ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన పోలీస్ సేవలు అందించడమే తన ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు.
మల్కాజిగిరి కమిషనరేట్ ప్రశాంత ప్రాంతంగా పేరుపొందిందని, ఆ ఖ్యాతిని కొనసాగిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో ఎక్కడా రాజీ పడబోమని ఆమె స్పష్టం చేశారు.
టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్‌కు ప్రాధాన్యం
నేరాల నియంత్రణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తామని సీపీ వెల్లడించారు. AI ఆధారిత “TG QUEST” వ్యవస్థను వినియోగించి నేరాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యంగా పెరుగుతున్న సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధితులకు వేగంగా న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని తెలిపారు.
సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
సమాజానికి పెను సవాలుగా మారుతున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. యువత మత్తుకు బానిస కాకుండా AI ఆధారిత నిఘా వ్యవస్థను బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.
ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు
కమిషనరేట్ పరిధిలో పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రజల ప్రయాణ భద్రతను మెరుగుపరచడమే తమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు.
మహిళా పోలీస్ కమిషనర్‌గా అవకాశం కల్పించిన ప్రభుత్వానికి, సహకరించిన డీజీపీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తమ బృందంతో కలిసి సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తానని సీపీ సుమతి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







