గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- May 02, 2026
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ ఆధ్వర్యంలో "క్రాస్ సేఫ్టీ" అనే నినాదంతో 38వ గల్ఫ్ ట్రాఫిక్ వీక్ నిర్వహిస్తున్నారు. సంబంధిత ప్రభుత్వ సంస్థలు మరియు ప్రైవేట్ రంగ కంపెనీల భాగస్వామ్యంతో మే 7 వరకు ఈ క్యాంపెయిన్ కొనసాగుతుంది.
రాయల్ ఒమన్ పోలీస్‌లో ట్రాఫిక్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ ఇంజనీర్ అలీ బిన్ సలీం అల్-ఫలాహి మాట్లాడుతూ.. ఈ ఏడాది పెడెస్ట్రియన్ ప్రమాదాలను తగ్గించడంపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. పెడెస్ట్రియన్ క్రాసింగ్‌ల వాడకాన్ని ప్రోత్సహించడంతోపాటు ట్రాఫిక్ సిగ్నల్‌లను ఫాలో కావడం ద్వారా రహదారి భద్రతా సేఫ్టీని పెంపొందించుకోవాలని కోరారు. సురక్షితంగా రోడ్డు దాటడం వల్ల ప్రమాదాలు తగ్గుతాయని పేర్కొన్నారు.
రాయల్ ఒమన్ పోలీస్ తమ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ ద్వారా నిర్వహించే ట్రాఫిక్ వీక్, అత్యంత ముఖ్యమైన అవగాహన కార్యక్రమాలలో ఒకటి అని, రహదారి భద్రతను పెంపొందించడంలో ఇది గణనీయమైన పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు.
ట్రాఫిక్ వీక్ కార్యకలాపాలు విభిన్నంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా అన్ని గవర్నరేట్‌లలోని షాపింగ్ సెంటర్లు మరియు ప్రైవేట్ ప్రదేశాలలో ట్రాఫిక్ ప్రదర్శనలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలలో వక్తల ఉపన్యాసాలు మరియు విద్యా కోర్సులను నిర్వహించడం, అనేక ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలతో సెమినార్‌ను నిర్వహించడం ద్వారా సమాజంలోని అన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని అవగాహన మరియు విద్యా కార్యక్రమాలు ఉంటాయని వివరించారు.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







