ముంబై సమీపంలోని భివండి లో రెండంతస్థుల భవనం కూలిపోయింది..
- August 07, 2016
మహారాష్ట్ర రాజధాని ముంబై సమీపంలోని భివండి ప్రాంతంలో రెండంతస్థుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో స్థానిక కళ్యాణ్ రోడ్డులోని రెండు అంతస్థులభవనం ఒక్కసారిగా కుప్పకూలింది.థానే మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకూ నలుగురిని శిథిలాల నుంచి బయటికి వెలికితీశారు.మరో ఎనిమిది మంది రాళ్ల మధ్య చిక్కుకుని ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గత ఆదివారం భివండి ప్రాంతంలోనే రెండు అంతస్థుల భవనం కూలి 9మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







