ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- May 03, 2026
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. చెన్నై బౌలర్లు అన్షుల్ కంబోజ్ (3 వికెట్లు), నూర్ అహ్మద్ (2 వికెట్లు) అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. నమన్ ధీర్ (57) ఒంటరి పోరాటం చేసినా, మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు.
160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. 67 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన రుతురాజ్, యువ బ్యాటర్ కార్తీక్ శర్మ (54 నాటౌట్)తో కలిసి ముంబై బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు అజేయంగా 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, మరో 11 బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చారు.
ఈ విజయంతో ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్‌ను 20 సార్లు ఓడించిన ఏకైక జట్టుగా సీఎస్కే అరుదైన మైలురాయిని చేరుకుంది. ఈ ఓటమితో ముంబై ప్లేఆఫ్ అవకాశాలు మరింత క్లిష్టంగా మారగా, సీఎస్కే తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.
తాజా వార్తలు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!







