సౌదీ అరేబియాలో ఫోర్డ్ బ్రాంకో కార్ల రీకాల్..!!
- November 02, 2026
రియాద్: సౌదీ అరేబియాలో ఫోర్డ్ బ్రాంకో, బ్రాంకో రాప్టర్ వాహనాల యజమానులకు కీలక హెచ్చరిక జారీ అయింది. ఇంజిన్ భాగంలోని విద్యుత్ వైర్లలో లోపం కారణంగా అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉండటంతో మొత్తం 3,680 వాహనాలను వెనక్కి పిలిపిస్తున్నట్లు సౌదీ వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2021 నుంచి 2026 మోడల్ సంవత్సరాలకు చెందిన ఫోర్డ్ బ్రాంకో, బ్రాంకో రాప్టర్ వాహనాలకు ఈ రీకాల్ వర్తిస్తుంది.
మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం.. ఇంజిన్ కంపార్ట్మెంట్లో ఉండే చిన్న విద్యుత్ వైర్లకు రక్షణగా ఏర్పాటు చేసిన కవరింగ్‌లో లోపం గుర్తించారు. దీంతో వైర్లు దెబ్బతిని షార్ట్ సర్క్యూట్ ఏర్పడే ప్రమాదం ఉంది. ఫలితంగా వాహనంలో మంటలు చెలరేగే అవకాశం ఉండటంతో పాటు ప్రయాణికులకు గాయాలు లేదా ప్రమాదాలు సంభవించే ముప్పు ఉందని అధికారులు హెచ్చరించారు.
వాహన యజమానులు ఏం చేయాలి?
రీకాల్ పరిధిలో తమ వాహనం ఉందో లేదో తెలుసుకోవడానికి యజమానులు వాహన గుర్తింపు సంఖ్య (VIN) ద్వారా అధికారిక వెబ్సైట్ [Recalls.sa] లో తనిఖీ చేసుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది. లోపం ఉన్నట్లు గుర్తిస్తే సంబంధిత డీలర్లను సంప్రదించి ఉచితంగా మరమ్మతులు చేయించుకోవాలని కోరింది.
మరిన్ని వివరాలకు అల్ జజీరా వెహికల్స్ ఏజెన్సీస్: 8007492222, మహమ్మద్ యూసుఫ్ నాగీ కంపెనీ: 8001240218 సంప్రదించాలని సూచించారు. వాహనాల్లో తలెత్తే విద్యుత్ లోపాల వల్ల ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ రీకాల్ చర్యలు చేపట్టినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసులకు కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ నిబంధనలు..!!
- 2027 నుంచి యూఏఈలో కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- ఖతార్ లో 8 ప్రాంతాల్లో క్లీనప్ డ్రైవ్ షెడ్యూల్..!!
- కువైట్లోడిజిటల్ చెల్లింపుల వైపు ప్రజల మొగ్గు..!!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్ బ్రాంకో కార్ల రీకాల్..!!
- చైనా-ఒమన్ మధ్య కీలక ఒప్పందాలు..!!
- హార్ముజ్ జలసంధి తెరవడం పై ఇరాన్ కీలక ప్రకటన
- మస్కట్‌లో దీపావళి సందడి..!
- డిసెంబర్ చమురు ఉత్పత్తి కోటా పై OPEC+ కీలక నిర్ణయం..!!
- ఎల్ఎన్జీ నౌకపై దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!







