డ్యాన్సింగ్‌ స్టార్‌, రాకింగ్‌ స్టార్‌, మెగాస్టార్‌ ఒకేచోట..!

- August 07, 2016 , by Maagulf
డ్యాన్సింగ్‌ స్టార్‌, రాకింగ్‌ స్టార్‌, మెగాస్టార్‌ ఒకేచోట..!

ఒకరేమో ఇండియన్‌ మైకేల్‌ జాక్సన్‌గా పేరుగాంచిన డ్యాన్సింగ్‌ స్టార్‌.. మరొకరు తన సంగీతం మంత్ర ముగ్ధులను చేయగల రాకింగ్‌ స్టార్‌.. ఇంకొకరు తన నటన, డ్యాన్స్‌, ఫైట్స్‌తో అలరించే మెగాస్టార్‌.. వారే ప్రభుదేవా, దేవి శ్రీ ప్రసాద్‌, చిరంజీవి. ఈ ముగ్గురు ఒకే చోట కలిశారు. ప్రసాద్‌ ఐమాక్స్‌లో ప్రదర్శించిన దేవిశ్రీ ప్రసాద్‌ థియేరేటికల్‌ ప్రైమర్‌ లైవ్‌ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ షోకు వీరు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుదేవా, చిరంజీవిలతో కలిసి సందడి చేస్తూ దిగిన ఫొటోలను దేవి శ్రీ ప్రసాద్‌ అభిమానులతో పంచుకున్నారు. .ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమాకు దేవిశ్రీ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com