మార్చిలో SR150 బిలియన్లు ఖర్చు చేసిన కన్జుమర్లు..!!
- May 05, 2026
రియాద్ః సౌదీ అరేబియాలో వినియోగదారుల(కన్జుమర్) వ్యయం పెరిగింది.2025 మార్చి నెలలో SR148 బిలియన్లుగా ఉన్న ఈ వ్యయం, 2026 మార్చి నాటికి SR150.1 బిలియన్లకు చేరుకుంది. ఈ మేరకు సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA) గణాంకాలను విడుదల చేసింది. గతేడితో పోలిస్తే, 2026 మార్చిలో సౌదీ అరేబియాలోని 'పాయింట్స్ ఆఫ్ సేల్' (POS) ద్వారా జరిగిన విక్రయాలు ఒక శాతం పెరిగి, సుమారు SR66.1 బిలియన్లకు చేరుకున్నాయి.
ATMల నుండి నగదు ఉపసంహరణలు 11 శాతం తగ్గి, SR48.6 బిలియన్లకు చేరుకున్నాయి.మడా (Mada) కార్డుల ద్వారా జరిగిన ఈ-కామర్స్ విక్రయాలు 28 శాతం పెరిగి, SR35.4 బిలియన్లకు చేరుకున్నాయి. ఈ విక్రయాలు 200.3 మిలియన్ల లావాదేవీల ద్వారా జరిగాయి. ఇ-కామర్స్ అమ్మకాలలో షాపింగ్ వెబ్‌సైట్‌లు మరియు మొబైల్ అప్లికేషన్‌ల ద్వారా చెల్లింపులు మరియు కొనుగోళ్ల కోసం మాడా కార్డులను ఉపయోగిస్తారు. సౌదీ అరేబియాలో కన్జుమర్ల ఖర్చులో నగదు ఉపసంహరణలు, పాయింట్-ఆఫ్-సేల్ (POS) అమ్మకాలు మరియు మాడా ద్వారా జరిగే ఇ-కామర్స్ అమ్మకాలు ఉంటాయి.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







