అబుదాబిలో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం..అంబులెన్స్‌లకు గ్రీన్ లైట్లు, ప్రమాదాల అంచనాకు ఏఐ..!!
- May 05, 2026
యూఏఈః అబుదాబిలో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. 2019 నుండి అబుదాబిలో స్పీడుకు సంబంధించిన ట్రాఫిక్ ప్రమాదాలు 15 శాతం నుండి 9 శాతానికి తగ్గాయి. అలాగే కొత్త స్మార్ట్-రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా అత్యవసర వాహనాలు ఇప్పుడు ట్రాఫిక్ లైట్లతో నేరుగా కమ్యూనికేట్ అయి 400 మీటర్ల దూరం నుండే గ్రీన్ సిగ్నల్స్‌ను ట్రిగ్గర్ చేయగలవని అధికారులు వెల్లడించారు. గల్ఫ్ ట్రాఫిక్ వీక్ కార్యక్రమాల సందర్భంగా ఈ అప్‌డేట్‌లను వెల్లడించారు.
ఈ కొత్త ట్రాఫిక్-గ్రీన్ లైట్ ప్రాధాన్యతా వ్యవస్థను ఇప్పటికే అంబులెన్స్‌లు, ఫైర్ ట్రక్కులు మరియు పోలీస్ పెట్రోలింగ్‌లతో సహా పెద్ద సంఖ్యలో అత్యవసర వాహనాల్లో ఇన్‌స్టాల్ చేశామని, చివరికి దీనిని మొత్తం వాహన సముదాయానికి విస్తరించే ప్రణాళికలు ఉన్నాయని అబుదాబి సివిల్ డిఫెన్స్ అధికారులు చెప్పారు. ఈ స్మార్ట్ టెక్నాలజీని గత సంవత్సరం ప్రవేశపెట్టారని, ఇతర వాహనాలకు ఎలాంటి అంతరాయం లేదా గందరగోళం కలిగించకుండా స్పందన సమయాలను తగ్గించడానికి దీనిని రూపొందించారని ఆ అధికారి తెలిపారు.
వాతావరణానికి అనుగుణంగా స్పీడ్ లిమిట్స్ సర్దుబాటు
గత సంవత్సరం పొగమంచు కారణంగా 76 వాహనాలు ఢీకొన్న ఘటన తర్వాత ప్రవేశపెట్టిన స్మార్ట్ రోడ్డు-భద్రతా వ్యవస్థ.. వాతావరణ సంబంధిత ప్రమాదాలను 50 శాతం తగ్గించడంలో సహాయపడిందని అధికారులు వెల్లడించారు. ఈ వ్యవస్థ పొగమంచు, వర్షం లేదా దుమ్ము వంటి ప్రతికూల పరిస్థితులను ఆటోమెటిక్ గా గుర్తించి డ్రైవర్లకు హెచ్చరికలు పంపించడంతోపాటు రిలయ్ టైమ్ లో స్వీడ్ లిమిట్స్ ను తగ్గిస్తుందన్నారు.
పెడస్ట్రెయిన్ భద్రతపై ఫోకస్
ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ సెంటర్ ప్రత్యేక గణాంకాల ప్రకారం..గత మూడేళ్లలో పాదచారుల(పెడస్ట్రెయిన్) భద్రత కూడా మెరుగుపడింది. పాదచారులను వాహనాలు ఢీకొట్టే ప్రమాదాలు 2023లో మొత్తం ప్రమాదాలలో 18 శాతం నుండి 2025 నాటికి 13 శాతానికి తగ్గాయి. అదే సమయంలో, పాదచారుల గాయపడటం/మరణాలు 13 శాతం నుండి 11 శాతానికి తగ్గాయి. వారి భద్రతకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అల్ సిలా మరియు అల్ మఫ్రాక్‌లలో రెండు రోడ్ ఓవర్ బ్రిడ్జీలు పూర్తయ్యాయని, మరో 24 పెడస్ట్రెయిన్ బ్రిడ్జిల పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. అలాగే, అల్ ఐన్‌లో ప్రస్తుతం 16 క్రాసింగ్‌ల నిర్మాణం జరుగుతుండగా, రాబోయే సంవత్సరాల్లో 31 స్మార్ట్ క్రాసింగ్‌లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు తెలిపారు.
ప్రమాదాల అంచనాకు ఏఐ (AI)
అబుదాబి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ఆధారిత ప్రిడిక్టివ్ సేఫ్టీ సిస్టమ్స్ వైపు అడుగులు వేస్తోందని అధికారులు తెలిపారు. ప్రమాదాలు ఎక్కడ ఎక్కువగా జరిగే అవకాశం ఉందో అంచనా వేయడానికి మరియు వాటిని పరిష్కరించడానికి చురుకైన ప్రణాళికలను రూపొందించడానికి తాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ప్రోగ్రామ్‌లను అభివృద్ధి చేస్తామని అధికారులు వెల్లడించారు. 2011 నుండి అబుదాబిలో రోడ్డు ప్రమాద మరణాలు 73 శాతం తగ్గాయని, త్రీవంగా గాయపడ్డ సంఘటనలు 18 శాతం తగ్గాయని అధికారులు తెలిపారు. దీనితో, ప్రతి లక్ష మందికి అత్యల్ప రోడ్డు ప్రమాద మరణాల రేటు కలిగిన దేశాలలో ఈ ఎమిరేట్ మిడిలీస్టు మరియు ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో మొదటి స్థానంలో, ప్రపంచవ్యాప్తంగా ఎనిమిదవ స్థానంలో నిలిచిందని వెల్లడించారు. 2030 నాటికి రోడ్డు భద్రత విషయంలో ప్రపంచంలోని మొదటి ఐదు అత్యంత సురక్షితమైన అధికార పరిధులలో ఒకటిగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- మక్కాలో మహిళను వేధించిన ప్రవాసి అరెస్టు..!!
- అబుదాబిలో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం..అంబులెన్స్‌లకు గ్రీన్ లైట్లు, ప్రమాదాల అంచనాకు ఏఐ..!!
- మార్చిలో SR150 బిలియన్లు ఖర్చు చేసిన కన్జుమర్లు..!!
- ఒమన్ లో నేటి నుంచి కొత్త ఇంధన కేంద్రాల నియంత్రణ చట్టం..!!
- కువైట్ విమానాశ్రయం పూర్తిస్థాయిలో సిద్ధం..భద్రతకు ప్రాధాన్యత..!!
- ఆస్తమా పై అవగాహనకు ఖతార్ హెల్త్ మినిస్ట్రీ కార్యాచరణ..!!
- IPL 2026: లక్నో పై ముంబై విజయం
- యూఏఈలో ఉన్నత విద్యాసంస్థల్లో తాత్కాలికంగా రిమోట్ లెర్నింగ్ అమలు
- కేరళలో యూడీఎఫ్ ప్రభంజనం: సీఎం అభ్యర్థి పై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోడీ









