విజయ్ పార్టీ (టీవీకే) TVK గెలుపు వెనుక కపిల్ సాహూ

- May 05, 2026 , by Maagulf
విజయ్ పార్టీ (టీవీకే) TVK గెలుపు వెనుక కపిల్ సాహూ

-ఐప్యాక్ నుంచి రెండేళ్ల క్రితం తన బృందంతో (12) బయటికొచ్చిన కపిల్

-ఈ రెండేళ్ల జర్నీలో మొదటి గెలుపు దిల్లీ (బీజేపీ), రెండో గెలుపు తమిళనాడు (టీవీకే)

చెన్నై: పొలిటికల్ కన్సల్టింగ్ డొమైన్ లో మరో కొత్త పేరు తెరమీదకి వచ్చింది. అదే కపిల్ సాహూ. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ వ్యూహకర్త కపిల్ సాహూ ఉన్నత విద్య అనంతరం కొంత కాలం పాటు ఐ ప్యాక్ తో కలిసి పని చేశారు.

రెండేళ్ల క్రితం ఐ ప్యాక్ నుంచి బయటకొచ్చిన ఆయన ఇప్పటి వరకు తొమ్మిది రాష్ట్రాలలో పని చేశారు. ఐప్యాక్ వ్యూహాలు ప్రస్తుత రాజకీయ పార్టీలకు గెలుపును అందించలేకపోవడంతో కపిల్ సాహూ తన కోర్ టీంతో 12 మంది సభ్యులతో బయటకొచ్చి స్వంతంగా రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా సేవలు అందించడం ప్రారంభించారు.  దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించి గెలుపును అందించారు. అనంతరం తమిళనాడులో సినీ హీరో విజయ్ పార్టీ (తమిళగ వెట్రి కజగం పార్టీ)కి తన టీంతో కలిసి రాజకీయ వ్యూహకర్త గా వ్యవహరించారు. ప్రశాంత్ కిషోర్ TVK పార్టీకి పనిచేయడం 2024 ఏడాదిలోనే ఆపేశారు. ఆ తర్వాత టీవీకే పార్టీ రాజకీయ వ్యూహకర్తగా పని చేసిన కపిల్ టీవీకే అభ్యర్థుల ఎంపిక, పార్టీ అభ్యర్థుల బలాబలాలు, పార్టీ నిర్మాణం, అధ్యక్షుడు విజయ్ ఎన్నికల ర్యాలీలు, ఎన్నికల వ్యూహాలు, సర్వే, డేటా, డిజిటల్, మీడియా కమ్యూనికేషన్స్ వంటి అంశాల్లో తన బృందంతో కలిసి విజయ్ పార్టీకి సేవలందించారు.

దీని ఫలితం రెండేళ్ల ముందు ప్రారంభించిన టీవీకే పార్టీ తమిళ రాజకీయాల్లో సంచలన విజయం సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించి చరిత్ర సృష్టించింది. 75 ఏళ్ల డీఎంకే, 52 ఏళ్ల అన్నా డీఎంకే వంటి రెండు సంప్రదాయ పార్టీలను టీవీకే అతిపెద్ద ఓటు బ్యాంకు కైవసం చేసుకుని చిత్తు చిత్తుగా ఓడించింది. గతంలో తొమ్మిది రాష్ట్రాల్లో వివిధ రాజకీయ పార్టీలకు రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించిన కపిల్ సాహు సేవలు విజయ్ పార్టీ భారీ గెలుపుకు దోహదం చేశాయి. ఇది టీవీకే పార్టీ అసాధారణ ఫలితాల వెనక ఉన్న అసలు వాస్తవాలు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com