హోర్ముజ్ జలసంధిని 'బేరసారాల సాధనంగా' చేయొద్దు: ఖతార్
- May 05, 2026
దోహా: హోర్ముజ్ జలసంధిని "బేరసారాల సాధనంగా(Bargaining Chip)" ఉపయోగించడాన్ని ఖతార్ తిరస్కరిస్తోందని మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. ఈ కీలక నౌకా మార్గాన్ని షరతులు లేకుండా తెరిచి ఉంచాలని కోరింది. జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛ అనేది రాజీపడలేని అంశమని స్పష్టం చేసింది. దీనికి ఎలాంటి అంతరాయం కలిగినా అది ప్రాంతీయ దేశాల కీలక ప్రయోజనాలకు ముప్పు కలిగిస్తుందని హెచ్చరించింది.
పొరుగు దేశాల ఆస్తులపై జరుగుతున్న అన్యాయమైన దాడులను ఆపాలని ఖతార్ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు పూర్తి సంఘీభావం వ్యక్తం చేయడంతో పాటు తన ఆస్తులను కాపాడుకోవడానికి యూఏఈ తీసుకుంటున్న అన్ని చర్యలకు మద్దతు తెలిపింది.
ఒమన్ గల్ఫ్ మరియు అరేబియా గల్ఫ్ మధ్య ఉన్న ఇరుకైన సముద్ర మార్గమైన హోర్ముజ్ జలసంధి.. ప్రపంచ చమురు రవాణాకు ఒక కీలకమైన మార్గంగా ఉంది. ప్రపంచ ఇంధన అవసరాల్లో 20 శాతం ఈ మార్గం నుంచే సరఫరా అవుతోంది.
అలాగే, హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న ADNOC అనుబంధ ఎమిరేట్స్ చమురు ట్యాంకర్‌పై ఇరాన్ జరిపిన దాడిని ఖతార్ తీవ్రంగా ఖండించింది. ఇది అంతర్జాతీయ చట్టం మరియు సముద్రయాన నిబంధనల ఉల్లంఘన అని పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







