తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు!
- May 05, 2026
చెన్నై: తమిళనాడు రాజకీయ యవనికపై నూతన అధ్యాయం మొదలుకాబోతోంది. తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. ఈ నెల 7వ తేదీన (ఎల్లుండి) ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నట్లు కోలీవుడ్, రాజకీయ వర్గాల్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తాజా ఎన్నికల ఫలితాల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో, విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం ఖాయమైంది.
విజయ్ ప్రమాణస్వీకార మహోత్సవానికి చెన్నై సెంట్రల్‌లోని ప్రఖ్యాత నెహ్రూ స్టేడియం వేదిక కానుంది. భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరం చేశారు. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నతాధికారులతో భద్రత, ఏర్పాట్లపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ స్థాయి నాయకులు కూడా హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ సాధించే క్రమంలో ఇతర పార్టీల మద్దతుపై విజయ్ దృష్టి సారించారు. కాంగ్రెస్ మరియు వామపక్ష పార్టీల మద్దతుతో సుస్థిర ప్రభుత్వాన్ని అందించాలని ఆయన భావిస్తున్నారు. గవర్నర్ భేటీ తర్వాత మంత్రివర్గ కూర్పుపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







