యువతికి పునర్జన్మ ప్రసాదించిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- May 05, 2026
హైదరాబాద్: గర్భస్రావం అనంతరం తలెత్తిన అత్యంత అరుదైన, ప్రాణాపాయకరమైన వైద్య సమస్యను హైదరాబాద్‌లోని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు అత్యాధునిక మల్టీడిసిప్లినరీ చికిత్సతో విజయవంతంగా పరిష్కరించారు. 32 ఏళ్ల యువతి ప్రాణాలను కాపాడటమే కాకుండా, ఆమె గర్భాశయాన్ని సంరక్షించి భవిష్యత్తులో తల్లి అయ్యే అవకాశాన్ని కూడా రక్షించారు.
గతంలో సిజేరియన్ డెలివరీ మరియు పునరావృత గర్భస్రావాల చరిత్ర కలిగిన ఈ మహిళ, ఆరు వారాల గర్భధారణలో మిస్డ్ అబార్షన్ కారణంగా స్థానికంగా D&C చేయించుకున్నారు. అనంతరం 25 రోజులకుపైగా నిరంతర రక్తస్రావంతో బాధపడుతూ అత్యవసర పరిస్థితిలో మెడికవర్ హాస్పిటల్స్‌ను ఆశ్రయించారు. సాధారణ వైద్య చికిత్సకు స్పందించకపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.
మెడికవర్ నిపుణులు నిర్వహించిన అధునాతన MRI మరియు ఇతర ఇమేజింగ్ పరీక్షల్లో గర్భాశయంలో మూడు ప్రధాన సమస్యలు బయటపడ్డాయి—రిటైన్డ్ ప్రొడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ (RPOC) అంటే గర్భస్రావం తర్వాత గర్భాశయంలో మిగిలిపోయిన కణజాలం, యుటెరైన్ ఆర్టీరియోవీనస్ మాల్ఫార్మేషన్ (AVM) అంటే అసాధారణ రక్తనాళాల కలయిక, అలాగే పాత సిజేరియన్ మచ్చ వద్ద పలచబడిన గర్భాశయ పొర (స్కార్ నిచ్ / ఇస్త్మోసీల్). ఈ మూడు సమస్యలు కలిసివచ్చినప్పుడు తీవ్ర రక్తస్రావం, ప్రాణాపాయం, గర్భాశయం తొలగించే పరిస్థితి ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
రోగి వయస్సు, భవిష్యత్ మాతృత్వాన్ని దృష్టిలో ఉంచుకుని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు గర్భాశయాన్ని కాపాడేలా దశలవారీ ప్రత్యేక చికిత్స ప్రణాళికను అమలు చేశారు.
మొదటగా డా. సాయి తేజ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్, ‘యుటెరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్’ అనే అత్యాధునిక ప్రక్రియ ద్వారా అసాధారణ రక్తప్రవాహాన్ని నియంత్రించి, ప్రాణాపాయకర రక్తస్రావ ప్రమాదాన్ని తగ్గించారు.
తదుపరి డా.పేరం పృథ్వి, కన్సల్టెంట్ రోబోటిక్ & లాపరోస్కోపిక్ గైనకాలజికల్ సర్జన్, అత్యంత క్లిష్టమైన మినిమల్లి ఇన్వేసివ్ శస్త్రచికిత్స ద్వారా గర్భాశయంలో నిలిచిపోయిన కణజాలాన్ని తొలగించడంతో పాటు, పాత సిజేరియన్ మచ్చ కారణంగా పలచబడిన గర్భాశయ పొరను (స్కార్ నిచ్) విజయవంతంగా సరిచేశారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







