ఒకప్పటి యాక్షన్ హీరో..వీడియో చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్

- May 05, 2026 , by Maagulf
ఒకప్పటి యాక్షన్ హీరో..వీడియో చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు యాక్షన్ హీరోగా ఒక వెలుగు వెలిగిన భానుచందర్ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించి, చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలకు పోటీనిస్తూ అనేక విజయవంతమైన చిత్రాల్లో ఆయన నటించారు. కేవలం హీరోగానే కాకుండా విలన్‌గా, సహాయ నటుడిగానూ తనదైన ముద్ర వేసిన ఆయన, ప్రస్తుతం 70 ఏళ్లు పైబడిన వయసులో అరుదుగా వెండితెరపై కనిపిస్తున్నారు.

తాజాగా ఆయనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమలాపురానికి చెందిన ప్రముఖ వంట మాస్టర్ చిట్టిబాబు వివాహ వార్షికోత్సవం సందర్భంగా భానుచందర్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వీడియోను విడుదల చేశారు. ఇందులో ఆయన నెరిసిన జుట్టు, తెల్లటి గడ్డంతో పూర్తిగా భిన్నమైన రూపంలో కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పటి చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉన్న ఈ యాక్షన్ స్టార్‌ను గుర్తుపట్టడం కష్టంగా మారిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

రూపం మారినప్పటికీ, భానుచందర్ మాటల్లోని గాంభీర్యం మాత్రం అలాగే ఉందని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 2022లో వచ్చిన ‘శాకిని డాకిని’, 2024లో విడుదలైన ‘రామ్’, ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ వంటి చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు. వయసు రీత్యా వచ్చిన ఈ మార్పు సహజమేనని, ఇప్పటికీ ఆయన వాయిస్ బేస్ వింటే పాత భానుచందర్ గుర్తుకొస్తున్నారని నెటిజన్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా నిలిచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com