HCA క్రికెట్ ఆపరేషన్స్ హెడ్‌గా అంబటి రాయుడు
- May 06, 2026
హైదరాబాద్: టీమిండియా మాజీ స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు తన కెరీర్‌లో మరో ముఖ్యమైన ఘట్టాన్ని ఆరంభించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) క్రికెట్ ఆపరేషన్స్ విభాగాధిపతిగా ఆయన నియమితులయ్యారు. మంగళవారం ఈ విషయాన్ని రాయుడు స్వయంగా ప్రకటించారు. వివాదాలు, పరిపాలనాపరమైన సవాళ్లతో సతమతమవుతున్న హెచ్‌సీఏలో రాయుడి వంటి అనుభవజ్ఞుడి రాక ప్రాధాన్యత సంతరించుకుంది.
సుప్రీంకోర్టు మానిటరింగ్ కమిటీ సభ్యుడు జస్టిస్ పి. నవీన్ రావు, హెచ్‌సీఏ కార్యదర్శి ఎం. జీవన్ రెడ్డి,అపెక్స్ కౌన్సిల్ ఈ నియామకాన్ని చేపట్టినట్లు రాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “హెచ్‌సీఏ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్‌గా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. అసోసియేషన్‌లో కొన్ని అంశాలను ప్రక్షాళన చేయడానికి, వ్యవస్థను మెరుగుపరచడానికి ఇది నాకు లభించిన గొప్ప అవకాశం” అని పేర్కొన్నారు.
హైదరాబాద్, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అపారమైన క్రికెట్ ప్రతిభను గుర్తించడంపైనే తాను ప్రధానంగా దృష్టి సారిస్తానని రాయుడు స్పష్టం చేశారు. స్థానిక యువ క్రీడాకారులకు సరైన వేదిక కల్పించి, వారు భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దడమే తన అంతిమ లక్ష్యమని వివరించారు. శిక్షణ పద్ధతులు, సెలక్షన్ ప్రక్రియలో పారదర్శకత తీసుకురావడం ద్వారా హైదరాబాద్ క్రికెట్ పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకువస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రాయుడు గతంలో హైదరాబాద్ రంజీ జట్టుకు సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించిన అనుభవం ఉంది. ఇక్కడి గ్రౌండ్స్, క్రీడాకారుల సామర్థ్యంపై ఆయనకు పూర్తి అవగాహన ఉండటం విశేషం. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వంటి దిగ్గజ జట్ల తరపున ఆడిన అనుభవం హెచ్‌సీఏ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







