తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- May 06, 2026
బంగాళాఖాతం నైరుతి దిశలో గాలి మళ్లింపు కనిపిస్తోంది. దీని ప్రభావంతో ఈ నెల 11 లేదా 12 తేదీల్లో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మార్పుల వల్ల రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ద్రోణి వల్ల ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. రాబోయే 48 గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఆకస్మికంగా కురుస్తున్న ఈ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కావడమే కాకుండా గాలి వేగం కూడా పెరిగే ఛాన్స్ ఉంది.
ఆందోళనలో అన్నదాతలు
అకాల వర్షాలు రైతులను కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. కోతకు వచ్చిన పంటలు తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం ఆరబోసిన కల్లాల్లోకి నీరు చేరడంతో నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని నిపుణులు కోరుతున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







