ఉప్పల్ స్టేడియం ఐపీఎల్ రూల్స్..
- May 06, 2026
హైదరాబాద్: ఐపీఎల్ మ్యాచ్‌ల దృష్ట్యా ఉప్పల్ స్టేడియం వద్ద భద్రతను పోలీసులు పెంచారు. క్రికెట్ ప్రేమికులు స్టేడియంలోకి వచ్చేటప్పుడు కొన్ని వస్తువులను తీసుకురావడంపై నిషేధం విధించారు. ముఖ్యంగా ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, పెద్ద బ్యాగులను లోపలికి అనుమతించరు. వీటితో పాటు ఇయర్ ఫోన్లు కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయని మల్కాజిగిరి పోలీసులు స్పష్టం చేశారు.
స్టేడియం లోపలికి వెళ్లేవారు సిగరెట్లు, లైటర్లు లాంటి పదార్థాలు వెంట తెచ్చుకోవద్దు. బయట నుంచి తెచ్చే ఆహార పదార్థాలు, వాటర్ బాటిళ్లకు కూడా అనుమతి లేదు. స్టేడియం వద్ద వస్తువులు దాచుకోవడానికి క్లోక్ రూమ్ సదుపాయం ఉండదు. కాబట్టి విలువైన వస్తువులను ఇంటి వద్దే ఉంచి రావడం ఉత్తమమని అధికారులు సూచిస్తున్నారు.
మ్యాచ్ చూడటానికి వచ్చే వారు పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ముందుగానే స్టేడియం చేరుకోవడం మంచిది. స్టేడియం ఎంట్రీ పాయింట్ల వద్ద తనిఖీలు ముమ్మరంగా జరుగుతాయి. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- RB చౌదరికి నివాళ్లు అర్పించిన TVK విజయ్
- టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు
- శ్రీసిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్
- విజయ్‌కు షాక్ ఇచ్చిన వామపక్ష పార్టీల నిర్ణయం
- ఉప్పల్ స్టేడియం ఐపీఎల్ రూల్స్..
- నార్త్ అల్ బటిన్హాలో టొబాకో తయారీ యూనిట్ సీజ్..!!
- కార్మికుల హక్కులు, సంస్కరణలపై ఫస్ట్ జాయింట్ మీటింగ్..!!
- దుబాయ్‌లోని ఖోర్ అల్ మమ్జర్ బీచ్ ప్రారంభం..ప్రత్యేకతలివే..!!
- యాత్రికుల మానసిక ఆరోగ్యం కోసం బుక్ విడుదల..!!
- డిజిటల్ వ్యవస్థలతో నియామక ప్రక్రియలు వేగవంతం..!!









