RB చౌదరికి నివాళ్లు అర్పించిన TVK విజయ్
- May 06, 2026
చెన్నై: చెన్నైలోని ఆర్.బి. చౌదరి నివాసానికి చేరుకున్న విజయ్, ఆయన భౌతికకాయం వద్ద పుష్పగుచ్చం ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. ఆర్.బి. చౌదరి నిర్మాణంలో విజయ్ నటించిన ‘తిరుపాచి’, ‘జిల్లా’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నాయి. ఈ సందర్భంగా ఆ సినిమాల సమయంలో చౌదరితో ఉన్న అనుబంధాన్ని విజయ్ గుర్తుచేసుకున్నారు. ఒక నిర్మాతగా ఆయన తనకు అందించిన ప్రోత్సాహం మరువలేనిదని, చిత్ర పరిశ్రమ ఒక గొప్ప మార్గదర్శకుడిని కోల్పోయిందని విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
హీరో జీవాను ఓదార్చిన విజయ్ తండ్రి మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆర్.బి. చౌదరి కుమారుడు, హీరో జీవాను చూడగానే విజయ్ భావోద్వేగానికి లోనయ్యారు. జీవాను దగ్గరకు తీసుకుని, ఆత్మీయంగా హగ్ చేసుకుని ఓదార్చారు. తండ్రిని కోల్పోయిన బాధను భరించే శక్తి ఆ దేవుడు జీవా కుటుంబానికి ప్రసాదించాలని విజయ్ కోరుకున్నారు. గతంలో జీవా మరియు విజయ్ కలిసి ‘నన్బన్’ (తెలుగులో స్నేహితుడు) సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ స్నేహంతోనే విజయ్ తన తమ్ముడి లాంటి జీవాను ఓదారుస్తున్న దృశ్యం అక్కడ ఉన్న వారిని కంటతడి పెట్టించింది.
నివాళులర్పించిన ఎస్.ఏ. చంద్రశేఖర్
విజయ్ రాకంటే ముందే ఆయన తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్ కూడా ఆర్.బి. చౌదరి పార్థివదేహాన్ని సందర్శించారు. చౌదరి మరియు చంద్రశేఖర్ మధ్య దశాబ్దాల కాలంగా వృత్తిపరమైన, వ్యక్తిగత స్నేహం ఉంది. తన ఆప్తమిత్రుడిని కోల్పోవడం పట్ల చంద్రశేఖర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమలో ఎంతోమంది ప్రతిభావంతులను పరిచయం చేసిన ఘనత చౌదరికే దక్కుతుందని ఆయన కొనియాడారు. రేపు జరగనున్న అంతిమ సంస్కారాలకు కోలీవుడ్ నుంచి మరిన్ని పెద్ద ఎత్తున ప్రముఖులు హాజరుకానున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసితులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన షేక్ మహమ్మద్
- హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్..
- దీపావళి వేళ యాదగిరిగుట్ట ఆలయ వేళల్లో మార్పులు
- కువైట్‌లో చోరీకి గురైన 4WD వాహనం లభ్యం..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై ప్రధాని వ్యాఖ్యలను వక్రీకరించారు..!!
- ఒమన్‌లో ఆసియాకు చెందిన వ్యక్తి అరెస్ట్..!!
- బహ్రెయిన్‌లో ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లకు ఊరట..!!
- దుబాయ్‌లో ఫేక్ పటెక్ ఫిలిప్ వాచ్ విక్రయం.. మహిళకు Dh10,000 ఫైన్..!!
- సౌదీ అరేబియాలో జిమ్‌లు, స్పోర్ట్స్ సెంటర్లకు తుది గడువు..!!
- ఖతార్ గ్రాండ్ ప్రి.. నవంబర్ 28 నుంచి రేసింగ్ సందడి..!!







